Dussehra 2020 Wishes (Photo Credits: IANS)

New Delhi, Oct 25: దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా శుభాకాంక్షలు (Dussehra 2020 Wishes) తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక​ విజయదశమి అని రాష్ట్రపతి (president kovind) పేర్కొనగా, విజయదశమి ప్రజలకు స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నామని ప్రధాని మోదీ (PM Narendra Modi) ఆకాంక్షించారు. అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఆత్మీయులందరితో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే విజయదశమి అని, అయితే ఈ ఏడాది కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశ ప్రజలంతా దసరా పండుగను కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంటివద్దనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి, శ్రేయస్సును కలుగజేయాలని ఆకాంక్షిస్తూ ఈ మేరకు వారు ట్వీట్‌ చేశారు.

Here's Check Their Tweets

కరోనాతో ఏర్పడిన సంక్షోభాన్ని జయిస్తామని ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, పండుగ సందర్భాల్లో స్థానిక వస్తువులనే కొనుగోలు చేయమని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే జవాన్లను గుర్తు చేసుకుంటూ వారి కోసం దీపం వెలిగించాలని కోరారు.

తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ (TS CM KCR) ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. దుర్గామాత ఆశీస్సుల‌తో మ‌నం చేసే ప‌నుల్లో విజ‌యం సాధించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆకాంక్షించారు. చెడు మీద ధ‌ర్మం సాధించిన విజ‌య‌మే విజ‌య‌శ‌మి అని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ద‌స‌రా పండుగ జ‌రుపుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోరారు.

అందరికీ దసరా శుభాకాంక్షలు, నవరాత్రి ప్రత్యేకత ఏంటి? వివిధ రాష్ట్రాల్లో శరన్నవరాత్రిను ఎలా జరుపుకుంటారు, తెలుగు రాష్ట్రాల్లో విజయదశమి వేడుకలు ఎలా ఉంటాయి? దసరాపై స్పెషల్ కథనం మీకోసం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటామని సీఎం వివరించారు. కరోనా మహమ్మారిని జయించి రాష్ట్ర ప్రజలు సంతోషంగా, సుసంపన్నంగా జీవించేలా ఆశీర్వదించాలని దుర్గాదేవిని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ప్రజలు విజయదశమిని జరుపుకోవాలని ప్రజలను సీఎం కోరారు.

దసరా విషెస్, కోట్స్, శుభాకాంక్షలు మీకోసం, లేటెస్ట్‌లీ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు, మీ బంధువులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AM CM YS Jagan) తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకే దసరా అని జగన్ పేర్కొన్నారు. చెడు ఎంత బలమైనది అయినా అంతిమ విజయం మాత్రం మంచిదేనని ఈ పండుగ చెబుతోందన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలకు మంచి జరగాలని, విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నట్టు జగన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ పండుగను జరుపుకోవాలంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంచన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.