Mumbai, july 8: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి (Mumbai) వ్యాప్తంగా 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోవండి ప్రాంతంలో 315 మి.మి., పోవాయ్‌లో 314 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు మునిగిపోవడంతో చాలా లోకల్ రైళ్ల (Local Trains) రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
భారీ వర్షాలకు నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ముంబయిలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు రహదారులపై మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ కొనసాగుతోంది. అటు స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవు ప్రకటించారు. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు, భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో రెండు రోజులు పాటు వానలు
ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం కూడా ముంబయిలో భారీ నుంచి అతిభారీ వర్షం (Heavy to Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ముంబయితో పాటు ఠాణె, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్‌కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Here's Videos
#WATCH | Maharashtra: The traffic slows down on Western Express Highway near Vile Parle as heavy rain lashes Mumbai city. pic.twitter.com/aAzQaayTqO
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Pedestrians and vehicles cross heavily waterlogged streets at King's Circle amid rains in Mumbai
A commuter says, "My car is stuck on the road. There is no point in blaming the government for the rains. The government is doing its job." pic.twitter.com/2v16Osb8NZ
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Local train services have resumed on Central Line after rainwater has receded; Visuals from Kurla station in Mumbai pic.twitter.com/r4vJEYr1Vc
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Pedestrian underpass at Vile Parle East waterlogged due to heavy rainfall in Mumbai pic.twitter.com/SAxCj5BYZ0
— ANI (@ANI) July 8, 2024
ఇక నిన్న ఠాణెలోని షాపూర్ ప్రాంతంలో ఓ రిసార్టును వరద నీరు చుట్టుముట్టగా.. అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యటకులను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పాల్ఘార్ జిల్లాలో పొలంలో పనిచేస్తూ వరదలో చిక్కుకున్న 16 మంది గ్రామస్థులను అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి.
వర్షాల కారణంగా 50కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. అనేక విమానయాన సంస్థలు ప్రయాణీకులను హెచ్చరించడానికి X (గతంలో Twitter)కి వెళ్లాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు విమాన స్థితిని తనిఖీ చేయమని వారిని కోరారు. భారీ వర్షాలకు మొత్తం 27 విమానాలను దారి మళ్లించారు. ఇవి హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ అయ్యాయి.
రెండు గంటల పాటు వర్షం ఆగితే నీటి ఎద్దడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నా రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 4.4 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడే అవకాశం ఉంది.