Vande bharat (Photo Credits: Twitter)

Hyderabad, April 07:  ఏపీ,తెలంగాణ మధ్య మరో వందే భారత్ ట్రైన్ (Vande Bharat train) పరుగులు పెట్టనుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలు సేవలందిస్తోంది. ఇప్పుడు రెండో వందే భారత్ ట్రైన్ రానుంది. సికింద్రాబాద్-తిరుపతి (Secundrabad-Tirupati Vande Bharat train)మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు. శనివారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ట్రైన్ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌ను మోదీ ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 8న మోదీ ప్రారంభించినా ఆ రోజు ప్రయాణికులను అనుమతి ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 9 నుంచి వందేభారత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు సర్వీసులు నడుస్తాయి. ఈ రైలులో టికెట్ల ధరల (Ticket Fares) వివరాలను విడుదల చేశారు.

Modi Hyderabad Tour: ఈ సారి కూడా మోదీ టూర్‌కు కేసీఆర్ దూరం, మరోసారి తెరమీదకు ప్రోటోకాల్ వివాదాన్ని తీసుకువచ్చిన బీజేపీ 

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1680 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ రేటును రూ.3080లుగా ఫిక్స్ చేశారు. అదే మాదిరిగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ రేటు రూ.1625 కాగా.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3030 అని తెలిపారు. సికింద్రాబాద్‌-తిరుపతి టికెట్‌ ధరలను పరిశీలిస్తే బేస్‌ ఫేర్‌ రూ.1168గా నిర్ణయించారు. రిజర్వేషన్‌ ఛార్జీ రూ.40, సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జీ రూ.45, మొత్తం జీఎస్టీ రూ.63గా పేర్కొన్నారు. రైల్లో సరఫరా చేసే ఆహార పదార్థాలకు గానూ రూ.364 చొప్పున ఒక్కో ప్రయాణికుడి నుంచి క్యాటరింగ్‌ ఛార్జీ వసూలు చేయనున్నారు. అదే తిరుపతి- సికింద్రాబాద్ రైల్లో బేస్‌ ఛార్జీని రూ.1169గా పేర్కొన్నారు. కేటరింగ్‌ ఛార్జీని మాత్రం రూ.308గా పేర్కొన్నారు. దీంతో అప్‌ అండ్‌ డౌన్‌ ఛార్జీల్లో వ్యత్యాసం నెలకొంది.

Hyderabad Traffic Restrictions: రేపు హైదరాబాద్ లో ప్రధాని పర్యటన... ఆయా మార్గాల్లో రోడ్లను మూసివేస్తున్నట్టు పోలీసుల ప్రకటన 

సికింద్రాబాద్‌ నుంచి ఒక్కో స్టేషన్‌కు ఛైర్‌కార్‌ ఛార్జీలు ఇలా..

సికింద్రాబాద్ టూ నల్గొండ – రూ.470

సికింద్రాబాద్ టూ గుంటూరు – రూ.865

సికింద్రాబాద్ టూ ఒంగోలు – రూ.1075

సికింద్రాబాద్ టూ నెల్లూరు – రూ.1270

ఎగ్జిక్యూటివ్‌ సెక్షన్ ఛార్జీలు ఇలా..

సికింద్రాబాద్ టూ నల్గొండ – రూ.900

సికింద్రాబాద్ టూ గుంటూరు – రూ.1620

సికింద్రాబాద్ టూ ఒంగోలు – రూ.2045

సికింద్రాబాద్ టూ నెల్లూరు – రూ.2455