Hindu Mahasabha leader Ranjit Bachchan shot dead by bike-borne assailants in Lucknow (Photo-Facebook)

Lucknow, Febuary 2: ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోలో కాల్పుల కలకలం రేగింది. విశ్వహిందూ మహాసభ నేత రంజిత్‌ బచ్చన్‌ను (Hindu Mahasabha leader Ranjit Bachchan) దుండగులు కాల్చి చంపారు.మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన బచ్చన్‌, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్‌ దూసుకుపోవడంతో బచ్చన్‌ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని పోలీసులు వెల్లడించారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో బచ్చన్ సోదరుడు చికిత్స పొందుతున్నాడు. వాళ్లు పిచ్చి కుక్కలతో సమానం

ఈ ఘటన లక్నోలోని హజరత్‌గంజ్‌లో (Hazratganj area) ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ భవంతి వద్ద జరిగింది. ఘటనాస్థలానికి ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఆరు క్రైం బ్రాంచ్ బృందాలు గాలింపులు చేపట్టాయి. నిందితులను త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు అంటున్నారు.

Here's ANI Tweet

ఇటీవల కాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హిందుత్వ ప్రతినిధులను కాల్చిచంపిన ఘటనల్లో ఇది రెండోది. గత అక్టోబర్‌లో హిందూ సమాజ్‌పార్టీ నాయకుడు కమలేశ్‌ తివారీని దుండగులు లక్నోలోని నక ప్రాంతంలో కాల్చి చంపారు. 2015లో ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తివారీ వార్తల్లో నిలిచారు.

భార్య తల నరికాడు, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు

ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో ముస్లిం సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్‌ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసిన తివారీ డిపాజిట్‌ కోల్పోయారు. పలు కేసుల్లో ఆయనపై అభియోగాలు ఉన్నాయి.