Hindu Mahasabha president Swami Chakrapani Maharaj. (Photo Credits: ANI)

New Delhi, Febuary 17: చైనా దేశాన్ని కోవిడ్-19 వైరస్ (COVID-19) అల్లకల్లోలం చేస్తున్న సంగతి అందరికీ విదితమే. రోజు రొజుకు అక్కడ మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. వైరస్ నియంత్రణలోకి రావడం లేదు. ఇలాంటి సమయంలో భారత హిందూ మహాసభ (Hindu Mahasabha) జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి కీలక వ్యాఖ్యలు చేశారు.

కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి లేదని ప్రకటించిన ఆ రాష్ట్ర మంత్రి

కరోనా.. వైరస్‌ కాదు. అది మూగజీవాలను కాపాడే అవతారం..అని వ్యాఖ్యానించారు. చైనా వాసులు జంతువులను హింసిస్తున్నారు. వాటిని చంపి తింటున్నారు. అందుకే చైనాపై కరోనా (Coronavirus) వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

యూకెలో కరోనా వల్ల 4 లక్షల మంది చనిపోతారట

చైనా (China) ఇప్పటికైనా కళ్లు తెరిచి కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలి..లేకుండా చైనీయులంతా కరోనాకు బలి కావాలసిందే' అని స్వామి చక్రపాణి (Swami Chakrapani) అన్నారు. ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కాదనీ..అది మూగజీవాలను కాపాడే దేవుడి అవతారమని అవి మనకు మృత్యుసందేశాన్ని ఇవ్వడానికి, మూగజీవాలను తినేవారికి శిక్ష వేయడానికి వచ్చిందని తెలిపారు.

కరోనా పని పట్టాలంటే 18 నెలలు ఆగాల్సిందే

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Chinese president Xi Jinping) కరోనా విగ్రహాన్ని సృష్టించి దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలి..లేకుండా చైనీయులంతా కరోనాకు బలైపోతారని వ్యాఖ్యానించారు.

ఘోస్ట్ నగరంగా మారిన చైనా

చైనీయులంతా భవిష్యత్తులో మాంసం తినమని ప్రతిజ్న చేయాలని..అలా చేస్తే కరోనా కరుణిస్తుందని కరోనా మృతులు తగ్గిపోతారనీ లేదంటే చైనీయులు చేసే తప్పిదానికి ప్రపంచం అంతా కరోనా వ్యాపిస్తుందని అన్నారు. దేవుడిని ఆరాధించినవారికి కరోనా రాదని, ప్రాణాంతక వ్యాధులు, వైరస్ లు సోకవని వారికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 69,268 నవల కరోనావైరస్ కేసులు మరియు 1,670 మరణాలు నమోదయ్యాయి. వాటిలో 68వేల 500 కేసులు నమోదయ్యాయి.