New Delhi, April 15: కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారతదేశంలో ఈ ఏడాది వేసవి కాలం పూర్తిగా లాక్డౌన్ లోనే గడిచిపోనుంది. ఇక ఆ వెంటనే వర్షకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భారతదేశానికి నైరుతి రుతుపవనాల రాక, దేశంలో నమోదయ్యే వర్షపాతానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (India Meteorological Department) మొదటి సూచికను బుధవారం విడుదల చేసింది.
ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 2020లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే మాన్‌సూన్ కాలానికి (Monsoon 2020) నమోదయ్యే వర్షపాతం దాని దీర్ఘకాలిక సగటు 100 శాతంలో +5 లేదా -5 శాతం లోపంతో ఉంటుందని అంచనా వేసింది.
ఎప్పట్లాగే జూన్ 1న రుతుపవనాలు కేరళలోని తిరువనంతపురాన్ని తాకనున్నాయి. అయితే భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రుతుపవనాల ప్రవేశం మరియు వెనుదిరిగే తేదీలలో IMD మార్పులను సూచించింది. రెండవ దశ దేశవ్యాప్త లాక్డౌన్ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
Here's the update by ANI:
This year we will have a normal monsoon. Quantitatively the monsoon rainfall, during the monsoon season 2020, is expected to be 100% of its long period average with an error of +5 or -5% due to model error: Madhavan Rajeevan, Secretary, Ministry of Earth Sciences (MoES). pic.twitter.com/gjgM0Ta1N8
— ANI (@ANI) April 15, 2020
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు రుతుపవనాల రాక సాధారణ తేదీలతో పోలిస్తే 3-7 రోజులు ఆలస్యం అవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వాయువ్య భారతదేశంలోని ప్రాంతాలలో మాత్రం రుతుపవనాలు జూలై 15కు బదులుగా వారం రోజులు ముందుగానే జూలై 8న ప్రవేశిస్తాయని తెలిపింది.
అక్టోబర్ 15న దక్షిణ భారతదేశం నుండి రుతుపవనాలు వెనుదిరగడం ద్వారా వర్షాకాలం ముగుస్తుందని ఐఎండీ అంచనావేసింది.