PM Modi at UNGA: నేను టీ అమ్మి ప్రధాని అయ్యాను, పాకిస్తాన్ పాముకు పాలు పోసి పెంచుతోంది, రండి భారత్‌లో వ్యాక్సిన్లు తయారుచేయండి, ఐరాస 76వ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగంలో హైలెట్స్ ఇవే..
Prime Minister Narendra Modi addresses the 76th Session of the UN General Assembly at United Nations headquarters in New York (Photo: AP/PTI)

New York, September 25: ఐరాస 76వ సమావేశంలో ప్రధాని మోదీ శనివారం పలు అంశాలపై (PM Modi at UNGA) పస్రంగించారు. ప్ర‌పంచ దేశాల‌కు అవ‌స‌ర‌మైన వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసేందుకు భార‌త్‌కు రావాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అంత‌ర్జాతీయ ఫార్మా సంస్థ‌ల‌ను ఆహ్వానించారు. ఇత‌ర దేశాల్లో అవ‌స‌ర‌మైన ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌ని పున‌రుద్ఘాటించారు. ఇందుకోసం గ్లోబ‌ల్ ఔష‌ధ త‌యారీ సంస్థ‌లు వ‌చ్చి.. భార‌త్‌లో వ్యాక్సిన్లు త‌యారు చేయాల‌ని మోదీ (Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు.

వందేండ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా క‌రోనా మ‌హ‌మ్మారితో (global coronavirus pandemic) గ‌త 18 నెల‌లుగా మోత్తం ప్ర‌పంచం ఇబ్బందులు ప‌డుతోంది. ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళుల‌ర్పిస్తున్నా.. వారి కుటుంబాల‌కు తీవ్ర సంతాపం తెలియ‌జేస్తున్నా అని మోదీ చెప్పారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో వ్యాక్సిన్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్ కోవిన్ ఒక్క రోజులో ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్‌లో డిజిట‌ల్ స‌పోర్ట్ అందిస్తున్న‌ద‌ని చెప్పారు. ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ కరోనా వ్యాక్సిన్‌ ‘జైకొవ్‌-డీ’ని భారత్‌ అభివృద్ధి చేసిందని, దీన్ని 12 ఏండ్లు నిండిన వారందరికీ ఇవ్వవచ్చని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. సేవే ఉత్తమ ధర్మం అని విశ్వసించే భారత్‌… వ్యాక్సిన్ల అభివృద్ధికి, తయారీకి శక్తివంచన లేకుండా కృషి చేసిందని చెప్పారు.

వచ్చే ఆరు వారాలే కరోనాకు కీలకం, పండగళ వేళ అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, దేశంలో తాజాగా 28,326 మందికి కోవిడ్

ఈ సమావేశంలో పాకిస్థాన్‌, చైనా తీరును పరోక్షంగా ఎండగట్టారు. ఉగ్రవాద వ్యాప్తికి ఎవరూ అఫ్గానిస్థాన్‌ను వాడుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి భారత్‌ గొప్ప ఉదాహరణ అని అన్నారు. రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన తాను ప్రధానమంత్రిగా ఎదిగానని చెప్పారు. కాగా సమితి సాధారణ అసెంబ్లీలో మోదీ ప్రసంగించడం ఇది నాలుగోసారి. కాగా, అమెరికాలో మూడు రోజుల పర్యటనను ముగించుకొని ఆయన తిరుగు పయనమయ్యారు. మోదీకి అమెరికా 157 భారత్‌ కళాఖండాలు, పురావస్తువులను అప్పగించింది. వాటిలో 7 వేల సంవత్సరాల నాటిది కూడా ఉంది. వాటిని మోదీ తనతో తీసుకువస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించే విషయంలో తాము పూర్తి మద్దతునిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పునరుద్ఘాటించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో మోదీ, బైడెన్‌ సమావేశం అనంతరం ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. ‘శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్నది. ఆ దేశం కల సాకారం కావడానికి అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అంతేగాక న్యూక్లియర్‌ సైప్లెయర్స్‌ గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ ప్రవేశించడానికి కూడా అమెరికా అండగా నిలుస్తుందని ఆ ప్రకటనలో బైడెన్‌ పేర్కొన్నారు.

సముద్రం అల్లకల్లోలం..తీవ్ర తుఫానుగా బలపడిన గులాబ్‌, వణుకుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌, సైక్లోన్ రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం

ఇక చైనా టెలికం కంపెనీల 5జీ టెక్నాల‌జీ దుర్వినియోగం అవుతుంద‌న్న అంచ‌నాల మ‌ధ్య సుర‌క్షిత‌మైన పార‌ద‌ర్శ‌క 5జీ టెలికం నెట్‌వ‌ర్క్ ఏర్పాటుతోపాటు సెమీ కండ‌క‌ర్ల స‌ర‌ఫ‌రాలో భ‌ద్ర‌త పెంచాల‌ని క్వాడ్ స‌ద‌స్సు నిర్ణ‌యించింది. ఐరాస స‌ర్వ‌స‌భ్య స‌మావేశాల నేప‌థ్యంలో అమెరికా, భార‌త్‌, ఆస్ట్రేలియా, జ‌పాన్ దేశాల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన క్వాడ్ కూట‌మి స‌మావేశ‌మైంది. స‌భ్య‌దేశాలు తొలిసారి భౌతికంగా కూట‌మి స‌ద‌స్సుకు హాజ‌రు కావ‌డం ఇదే మొద‌టి సారి.

ప్ర‌పంచ దేశాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా భారీగా సెమీ కండ‌క్ట‌ర్ల మాన్యుఫాక్చ‌రింగ్ కెపాసిటీ పెంచుకోవ‌డంపై చైనా టెక్ సంస్థ‌లు దృష్టి సారించాయి. అలాగే 5జీ నెట్‌వ‌ర్క్‌పైనా చైనా సంస్థ‌లు ప‌ట్టు క‌లిగి ఉండ‌టం ప‌ట్ల‌ క్వాడ్ దేశాల నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన‌ ఈ స‌ద‌స్సులో భార‌త్ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మొర్రిస‌న్‌, జ‌పాన్ ప్ర‌ధాని యోషిహిదే సుగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు.

ప్రధాని మోదీ ప్రసంగంలో హైలెట్స్

వాళ్లు ఉగ్ర‌వాదాన్ని రాజ‌కీయ ప‌నిముట్టుగా ఉప‌యోగిస్తున్నార‌ని పొరుగు దేశం పాకిస్థాన్‌ను ఉద్దేశించి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. ఐక్య‌రాజ్య‌స‌మితి సాధార‌ణ‌స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాని పాకిస్థాన్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ శుక్ర‌వారం ఇదే స‌భ‌లో జ‌మ్ముక‌శ్మీర్ విష‌యంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు ప్ర‌ధాని మోదీ త‌న వ్యాఖ్య‌ల ద్వారా కౌంట‌ర్ ఇచ్చారు. ప్ర‌పంచంలో వెనుక‌బాటుకు దారితీసే ఆలోచ‌న‌లు, తీవ్ర‌వాదం అంత‌కంత‌కే పెరుగుతున్నాయ‌ని ప్ర‌ధాని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.

ఉగ్ర‌వాదాన్ని రాజ‌కీయ ప‌రిక‌రంగా ఉప‌యోగిస్తున్న వాళ్లు అది ఎప్ప‌టికైనా వాళ్ల‌కు కూడా ప్ర‌మాద‌క‌ర‌మేన‌నే సంగ‌తి తెలుసుకోవాల‌ని పాకిస్థాన్‌ను ఉద్దేశించి ప్ర‌ధాని ప‌రోక్ష సూచ‌న చేశారు. కాగా, పాకిస్థాన్‌లో ల‌ష్క‌రే ఎ తాయిబా, జైష్ ఎ మ‌హ‌మ్మ‌ద్ లాంటి ఉగ్ర‌వాద సంస్థ‌లు ఉన్నాయి. ఈ విష‌యాన్ని భార‌త్ ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌స్తావించింది. అమెరికాలో వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై దాడికి సూత్ర‌ధారి అయిన ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోనే చిక్కాడు. అంతేగాక భార‌త స‌రిహ‌ద్దు వెంబ‌డి పాకిస్థాన్ భూభాగంలో అనే ఉగ్ర‌వాద క్యాంపులు ఉన్నాయి. 2019 ఫిబ్ర‌వ‌రిలో బాలాకోట్‌లోని ఓ క్యాంపుపై భార‌త్ వైమానిక దాడులు చేసింది.

ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పాముకు పాలు పోస్తున్నామని అర్ధం చేసుకోవాలని, ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలని ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి వేదికగా చురకలంటించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ స్వర్గధామంగా మారుతోందని పొరుగుదేశాలు గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఐరాస వేదికగా ప్రధాని గట్టి హెచ్చరిక చేశారు.

అఫ్గాన్, కరోనా, ఇండోపసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు.. వంటి అనేక అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం తిరోగామి ఆలోచనా విధానాలు, అతివాద విధానాలతో సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచమంతా శాస్త్రీయాధారిత ధృక్పధాన్ని, పురోగామి మార్గాన్ని అవలంబించి అభివృద్ధి దిశగా పయనించాలని అభిలíÙంచారు. శాస్త్రీయ ధోరణులను పెంపొందించేందుకు భారత్‌ అనుభవాధారిత విద్యను ప్రోత్సహిస్తోందని చెప్పారు.

ఒక టీ అమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ఐరాసలో భారత ప్రధానిగా ప్రసంగించేవరకు సాగిన నా జీవితం భారతీయ ప్రజాస్వామిక బలానికి నిదర్శనం. ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లివంటిది. ఈ ఏడాది ఆగస్టు 15న ఇండియా 75వ స్వాతంత్య్రోత్సవాలు జరుపుకుంది. భారత్‌లో భిన్నత్వమే బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. వివిధ ప్రభుత్వాల అధినేతగా త్వరలో నేను 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమైందనేందుకు నేనే నిదర్శనం.

ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. వివిధ దేశాలకు ఆలంబనగా ఉండాలనుకుంటే ఐరాస విశ్వసనీయతను పెంచాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుంటే విఫలమైనట్లేనన్న చాణక్య సూక్తిని గుర్తు చేసుకోవాలి. కరోనా, వాతావరణ మార్పు తదితర అంశాల్లో ఐరాస ప్రవర్తన గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అఫ్గాన్‌ ఉదంతం ఐరాస తీరుపై ప్రశ్నల్లో వాడిని పెంచాయి. కరోనా పుట్టుక, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాకింగులు, అంతర్జాతీయ సంస్థల పనితీరు వంటివి అనేక సంవత్సరాల ఐరాస కృషిని, ఐరాసపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఐరాసను అందరం బలోపేతం చేయాలి. అప్పుడే అంతర్జాతీయ చట్టాలు, విలువలకు రక్షణ లభిస్తుంది.

మహ్మమారిపై పోరు ప్రపంచప్రజలకు ఐకమత్యం విలువను తెలియజేసింది. రెండేళ్లుగా ప్రపంచ మానవాళి జీవితంలో ఒకసారి ఎదురయ్యే యుద్ధాన్ని చేస్తోంది. కలిసిఉండే కలుగు విజయమని ఈ పోరాటం మనకు తెలిపింది. దేశాల మధ్య సంపూర్ణ సహకారంతో కరోనాపై పోరు సలుపుతున్నాం. రికార్డు సమయంలో టీకాను ఉత్పత్తి చేయగలిగాం. సేవే పరమ ధర్మం అనే సూత్రంపై ఆధారపడే భారత్‌ కరోనా టీకా రూపకల్పనలో తొలినుంచి కీలక పాత్ర పోషించింది. వనరులు పరిమితంగా ఉన్నా సరే సమర్ధవంతంగా వాడుకొని ప్రపంచానికి తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా టీకాను అందించింది. కరోనా నాసల్‌ టీకా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మానవత్వాన్ని మర్చిపోని భారత్‌ మరోమారు టీకాల ఎగుమతిని ఆరంభించింది. ప్రపంచంలో టీకాలు తయారుచేసే ఏ సంస్థయినా భారత్‌లో ఉత్పత్తి ఆరంభించవచ్చు.

భారత్‌లో సంస్కరణలు ప్రపంచాభివృద్ధికి మార్గదర్శకాలు. భారత్‌ వృద్ధి బాటలో పయనిస్తే ప్రపంచం కూడా అదే బాటలో పయనిస్తుంది. అభివృద్ధి ఎప్పుడూ సమ్మిళితంగా అందరికీ అందేదిగా ఉండాలి. విస్తరణ, బహిష్కరణ పోటీల నుంచి సముద్రాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. సముద్ర వనరులను ఉపయోగించుకోవాలి కానీ దురి్వనియోగం చేయకూడదు. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే కీలకం. వీటిని కాపాడాలుకోవడం కోసం అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలి. నిబంధనల పాటింపు, స్వేచ్ఛాయుత నేవిగేషన్, వివాదాల శాంతియుత పరిష్కారం, ప్రజాస్వామిక విలువలు, రాజ్యాల సార్వ¿ౌమత్వం కోసం అంతా పాటుపడాలి. వాతావరణ మార్పు ప్రభావం భూగోళంపై తీవ్రంగా పడుతోంది. ప్రకృతికి అనుగుణ జీవనం సాగించడమే దీని నివారణకు మార్గం. పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా భారత్‌ మాత్రమే తగిన చర్యలు తీసుకుంది.

అఫ్గాన్‌లో సున్నితమైన పరిస్థితులను ఏ దేశం కూడా తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడాలి. ఎవరూ అఫ్గాన్‌ను స్వీయ అవసరాలకు వాడుకోకుండా నిలువరించాలి. కల్లోల అఫ్గాన్‌కు అంతా సాయం అందించాలి. ఆదేశంలో మైనారీ్టలకు రక్షణ లభించేందుకు కృషి చేయాలి. ‘‘మంచి పని చేసేందుకు ధైర్యంగా ముందుకు సాగితే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ అధిగమించవచ్చు’’ అనే రవీంద్రనాధ్‌ టాగూర్‌ వ్యాఖ్యతో ప్రధాని ప్రసంగాన్ని ముగించారు.

ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ శనివారం స్వదేశానికి తిరుగుప్రయాణం అయ్యారు. పర్యటనలో ద్వైపాక్షిక, బహులపక్ష ఒప్పందాలు కుదిరాయన్నారు.