India-China LAC Standoff: భారత్‌-చైనా సరిహద్దు వివాదం, లడఖ్‌లో రాజ్‌నాథ్ సింగ్, ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితులను సమీక్షిచేందుకు పర్యటన, రక్షణ మంత్రి వెంట బిపిన్ రావ‌త్, ముకుంద్‌ నరవణే
India-China LAC standoff: Defence minister Rajnath Singh, CDS Bipin Rawat and Army Chief reaches Ladakh (Photo-ANI)

Ladakh, July 17: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ (Defence minister Rajnath Singh) శుక్రవారం ఉదయం‌ లడఖ్‌ చేరుకున్నారు. భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన (India-China LAC Standoff) కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన పర్యటిస్తున్నారు. భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసు, లడఖ్‌ భారత్‌లో అంతర్భాగమే, సైనికులను చూసి దేశం గర్వపడుతోంది, బార్డర్లో సైనికుల్లో ఉత్తేజాన్ని నింపిన ప్రధాని నరేంద్ర మోదీ

ల‌డ‌ఖ్‌లో (Ladakh) స‌రిహ‌ద్దు వ‌ద్ద చైనాతో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన నేప‌థ్యంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లోని స్త‌క్నా ఫార్వ‌ర్డ్ ఏరియాను సంద‌ర్శించారు. ఆయన వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావ‌త్ (CDS Bipin Rawat), ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే (Army Chief Mukund Naravane) కూడా ఉన్నారు.‌

ఈ సంధర్భంగా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులను కలసి మంత్రి సంఘీభావం తెలపనున్నారు. లడఖ్ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ సైనిక అధికారుల‌తో మాట్లాడారు. ఆ త‌ర్వాత ప్యారా డ్రాపింగ్‌, స్కోపింగ్ ఆయుధాల‌ను ప‌రిశీలించారు. రెండు రోజుల పాటు ఆయన ల‌డ‌ఖ్‌, క‌శ్మీర్‌ల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. భారత సైనికుల మధ్య అనూహ్యంగా ప్రధాని మోదీ, సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో లడఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన, ప్రధాని వెంట బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే

ఇటీవ‌ల ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో ఉన్న వాస్త‌వాధీన రేఖ వెంట చైనా సైనికుల‌తో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన విష‌యం తెలిసిందే. జూన్ 15వ తేదీన జ‌రిగిన దాడిలో 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఇక ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సఖ్యత నెలకొనేందుకు భారత్‌-చైనా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కమాండర్‌ స్థాయి చర్చలు జరుగుతున్నాయి.

Updated By ANI

ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి రెండు దేశాల సైనిక బలగాలు కొంతమేరకు వెనక్కు వెళ్లాయి. గాల్వ‌న్ లోయ‌, పాంగ్‌సాంగ్ సో ప్రాంతాల్లో ఉన్న చైనా సైన్యం రెండు కిలోమీట‌ర్ల మేర వెన‌క్కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ విష‌యంలో ఇప్ప‌టికే రెండు దేశాల సైనిక అధికారుల మ‌ధ్య నాలుగుసార్లు చ‌ర్చ‌లు జ‌రిగాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శనివారం శ్రీనగర్‌లో పర్యటిస్తారు. నియంత్రణ రేఖ, శ్రీనగర్‌ లోయలో నెలకొన్న పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. కాగా, కొద్ది రోజులే కిందటే రాజ్‌నాథ్‌ సింగ్‌ లడఖ్‌ పర్యటకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈలోపే ప్రధాని మోదీ లడఖ్‌లో ఆకస్మిక పర్యటన చేపట్టారు.