New Delhi, June 16: భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు (India-China Tensions) తగ్గుతున్నాయని సంకేతాలు అందుతున్న వేళ ఒక్కసారిగా అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. భారత, చైనా సరిహద్దుల్లోని (India China Border) లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్ణణలో భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు. మరణించిన వారిలో భారత పదాతిదళానికి చెందిన వారున్నారు. ఈ ఘర్షణతో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవనియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు (India China Border Tension) నెలకొన్నాయి. పాకిస్థాన్‌లో ఇద్దరు భారత దౌత్యాధికారులు మిస్సింగ్, అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన భారత్
భారత, చైనా సైనిక బలగాల మధ్య హింసాత్మక దాడికి దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. నెలన్నర రోజులుగా లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా దళాలు మోహరించి ఉన్నాయి. గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సోలోని నియంత్రణ రేఖ వద్ద చైనా సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. చైనా సైనికులు సరిహద్దుల్లో ఉనికిని పెంచుకున్న నేపథ్యంలో భారత సైనిక దళాలు, వాహనాలు, ఫిరంగి తుపాకులను తూర్పు లడఖ్‌కు పంపించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
లడక్ గల్వన్ లోయలో నిన్న రాత్రి రెండు దేశాలూ బలగాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో చైనా బలగాలు రాళ్లు రువ్వడంతో పాటు హింసకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణలో భారత కల్నల్‌తో పాటు ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా రెండు వైపులా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. తమ సైనికులపై భారత జవాన్లు దాడులకు పాల్పడ్డారని చైనా ఆరోపించింది. అయితే చైనా వైపు ఎంతమంది జవాన్లకు గాయాలయ్యాయనేది ఇంకా తెలియలేదు.ఐదుగురు చైనా జవాన్లు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చైనా అధికారికంగా ప్రకటించలేదు. బరితెగించిన చైనా, వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలను మోహరింపు, గస్తీ ముమ్మరం చేసిన భారత్, సరిహద్దు రక్షణ కోసం ఆర్మీ కమాండర్లతో నరవాణే చర్చలు
బలగాల ఉపసంహరణ సమయంలో భారత జవాన్లు రెండు సార్లు హద్దులు మీరి దాడులకు పాల్పడ్డారని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. వెంటనే పరిస్థితులను అదుపు చేసేందుకు రెండు దేశాల సైన్యాధికారులు చర్చలు ప్రారంభించారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. భారత బలగాల ఏకపక్ష దాడులు పరిస్థితులను దిగజారుస్తాయని చైనా హెచ్చరించింది. ఉద్రిక్తతలు చల్లార్చేందుకు రెండు దేశాల మేజర్ జనరళ్ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు దేశాల మధ్య ప్రారంభమైన మేజర్ జనరల్‌ల చర్చలు ఉద్రిక్తతలు తగ్గించవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ఓవైపు ఇరు దేశాల దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నా.. భారత జవాన్లపై డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజా అలజడి నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ఆర్మీ అప్రమత్తమయ్యింది. చైనా దాడులను తిప్పికొట్టే విధంగా బలగాలను తరలిస్తున్నట్టు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు.
ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా తుర్క్‌వాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం అందడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. భద్రతా బలగాల మూమెంట్స్‌ను పసిగట్టిన తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా, సంఘటనా స్థలంలో రెండు ఏకే- 47 తుపాకులు, ఇన్సాస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం రాష్ట్రీయ రైఫిల్ స్థావరానికి కూతవేటు దూరంలో ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా, పది రోజుల్లో ముష్కరుల ఏరివేతకు భద్రతా బలగాలు జరిపిన నాలుగో ఆపరేషన్ ఇది. ఈ నెలలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 19 మంది హతమయ్యారు.