Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, Sep 25: దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇవి కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు (Coronavirus deaths in india) చేరింది. ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోగా 4,46,658 మంది మృతిచెందారు. మరో 3,01,442 కేసులు (COVID-19 in India) యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,046 మంది బాధితులు కోలుకున్నారని, 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రికరీ రేటు 97.78 శాతానికి చేరిందని తెలిపింది.

దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో 17,983 కేసులు కేరళలోనే ఉన్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో నిన్న 127 మంది మరణించారని వెల్లడించింది. మరో 127 మంది మరణించారని ప్రకటించింది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,04,051 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

ఇక కరోనా పాజిటివ్‌ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య (Man dies of COVID fear) చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్తామని పేర్కొన్నది. గతంలో డెత్‌ సర్టిఫికెట్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినప్పుడు ఆత్మహత్య చేసుకొన్నవారిని కరోనా మృతులుగా గుర్తించలేమని కేంద్రం పేర్కొన్నది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ విషయంలో పునరాలోచన చేయాలని సూచించింది.

చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, విశ్వరూపం చూపిస్తున్న డెల్టా వేరియంట్, ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లోకి

ఈ నేపథ్యంలో కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం( compensation for Covid-19 deaths) చెల్లించాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు సిఫార్లు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు(Supreme Court) తెలిపింది. ఈ పరిహారాన్ని రాష్ట్రాలు.. స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్(State disaster response fund) నుంచి చెల్లించాలని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం అందనుంది.

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామంటూ కేంద్రప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ‘బాధిత కుటుంబాలకు ఇది ఓదార్పునిస్తుంది. వారి కన్నీటిని తుడిచే చర్య చేపట్టడం మాకు సంతోషంగా ఉంది’ అని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిహారంపై పలు మార్గదర్శకాలతో వచ్చే నెల 4న ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.

వచ్చే ఏడాది మొత్తం మాస్కులు ధరించాల్సిందే, స్పష్టం చేసిన నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌

అయితే కరోనా సోకడంతో ఆందోళన చెందిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబాలు కూడా పరిహారం పొందేందుకు అర్హలేనని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు((Supreme Court)) తెలిపింది. కోవిడ్ పాజటివ్ రిపోర్ట్ వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబ సభ్యులు పరిహారం పొందడానికి అర్హులని చెప్పింది. దీంతో కరోనా పాజటివ్‌గా తేలడంతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ కూడా రూ. 50వేల పరిహారం అందనుంది.

కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు 30 రోజుల్లోగా పరిహారం అందుతుందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం బాధిత కుటుంబాలు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే దరఖాస్తు ఫారం నింపి, అవసరమైన సర్టిఫికేట్స్ జత చేయాల్సి ఉంటుంది. వాటిని జిల్లా అధికారుల కమిటీ తనిఖీ చేస్తుంది. జిల్లా కమిటీలో కలెక్టర్‌, వైద్య-ఆరోగ్య అధికారి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, మరో నిపుణుడు సభ్యులుగా ఉంటారు. దరఖాస్తులను పరిశీలించి.. ఈ కమిటీ చేసే సిఫార్సు మేరకు పరిహరం చెల్లించనున్నారు.