
New Delhi, January 21: దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ, వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 15,223 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 1,06,10,883కు చేరింది. నిన్న ఒక్కరోజే 151 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,52,869కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,965 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,02,65,706 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,92,308 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.75% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.81% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.44% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID19 Recovery Rate:
✅India's #COVID19 recovery rate improves to 96.75% as on January 21, 2021#IndiaFightsCorona#Unite2FightCorona
Via @MoHFW_INDIA pic.twitter.com/7vEM6D8zIn
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) January 21, 2021
ఇక జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా 18,93,47,782 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,80,835 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక మరోవైపు దేశవ్యాప్తంగా కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చురుగ్గానే సాగుతోంది. జనవరి 20న ఒక్కరోజే, సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా 1,12,007 ఆరోగ్య సిబ్బంది టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.