COVID19 in India: భారత్‌లో ఒక్కరోజులోనే అత్యధికంగా సుమారు 5 వేల పాజిటివ్ కేసులు నమోదు, దేశంలో 90 వేలు దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 3 వేలకు చేరువలో కరోనా మరణాలు
Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, May 17:  భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 90 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 4,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 90,927 కు చేరింది. నిన్న ఒక్కరోజే 120 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,872కు పెరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ చివరి విడత ప్రకటనలు ఆదివారం 11 గంటల నుంచి వివరించనున్న నిర్మల సీతారామన్

నిన్న దేశవ్యాప్తంగా 3956 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 34,108 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 53,946 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రాల వారీగా కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

S. No. Name of State / UT Total Confirmed cases* Cured/Discharged/Migrated Deaths**
1 Andaman and Nicobar Islands 33 33 0
2 Andhra Pradesh 2355 1353 49
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 92 41 2
5 Bihar 1179 453 7
6 Chandigarh 191 51 3
7 Chhattisgarh 67 56 0
8 Dadar Nagar Haveli 1 0 0
9 Delhi 9333 3926 129
10 Goa 17 7 0
11 Gujarat 10988 4308 625
12 Haryana 887 514 13
13 Himachal Pradesh 78 43 3
14 Jammu and Kashmir 1121 542 12
15 Jharkhand 217 113 3
16 Karnataka 1092 496 36
17 Kerala 587 495 4
18 Ladakh 43 22 0
19 Madhya Pradesh 4789 2315 243
20 Maharashtra 30706 7088 1135
21 Manipur 7 2 0
22 Meghalaya 13 11 1
23 Mizoram 1 1 0
24 Odisha 737 196 3
25 Puducherry 13 9 1
26 Punjab 1946 1257 32
27 Rajasthan 4960 2839 126
28 Tamil Nadu 10585 3538 74
29 Telengana 1509 971 34
30 Tripura 167 64 0
31 Uttarakhand 88 51 1
32 Uttar Pradesh 4258 2441 104
33 West Bengal 2576 872 232
Cases being reassigned to states 290
Total number of confirmed cases in India 90927# 34109 2872

భారతదేశంలో కోవిడ్-19 తీవ్రత అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసులో 1/3 వంతు మహారాష్ట్రలో నమోదైనవే. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య ఇప్పటికే 30 వేలు దాటగా, ఒక్క ముంబై నగరంలోనే కేసులు 19 వేలకు చేరువై, 20 వేల దిశగా వెళ్తున్నాయి. మరణాల సంఖ్య కూడా ఈ రాష్ట్రం నుంచే అత్యధికంగా 1135 కరోనా మరణాలు నమోదయ్యాయి.  మహారాష్ట్ర తరువాత గుజరాత్ (10,988), తమిళనాడు (10,585), దిల్లీ (9333) లలో ఎక్కువగా  పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Lockdown-4 కు సిద్ధమవండి: పీఎం మోదీ

ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న మూడవ విడత లాక్డౌన్ నేటితో ముగియనుంది. రేపు మే 18 నుంచి దేశంలో లాక్డౌన్-4 అమలులోకి రాబోతుంది. ఇప్పటివరకు విధించిన లాక్డౌన్లకు భిన్నంగా ఈ లాక్డౌన్ ఉండబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రేపట్నించి అమలులోకి రాబోయే లాక్డౌన్ విధింపులో రాష్ట్రాలకే అధికారం ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయా రాష్ట్రాలు వారి దగ్గర ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లక్డౌన్ అమలు, ఆంక్షల సడలింపులు ఉండే అవకాశం ఉంది. ఏదైమైనా ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఈరోజు కేంద్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.