Corona in India: దేశంలో చాపకింద నీరులా థర్డ్ వేవ్, కొత్తగా 29,689 మందికి కరోనా, గత 24 గంటల్లో 42,363 మంది డిశ్చార్జ్, ప్రస్తుతం 3,98,100 కరోనా పాజిటివ్‌ కేసులు
Coronavirus Outbreak (Photo credits: IANS)

New Delhi, July 27: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,689 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry) మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 415 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ (Covid in India) బారినపడి మొత్తం 4,21,382 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 42,363 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,06,21,469 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,98,100 కరోనా పాజిటివ్‌ కేసులు (Active Cases) ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3.14 కోట్ల మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 44,19,12,395 మంది కరోనా వ్యాక్సిన్‌ (Corona Vaccination) తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలే ఇందుకు సూచికలుగా నిలుస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య రెండింతలయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నాడు పాజిటివిటీ రేటు 3.4 శాతంగా నమోదయ్యింది. అంతకుమందు వారంలో ఇది 1.68 శాతంగా ఉంది. ఈ గణాకాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి.

వణికిస్తున్న మరో కొత్త వేరియంట్, బ్రిటన్‌లో 16 మందిలో B.1.621 రకం కరోనావైరస్, లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో యూకేలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

కరోనా కేసులు తగ్గడానికి బదులు రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కరోనా థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో పాజిటివిటీ రేటు 18 నుంచి 20 శాతం వరకూ చేరుకుంది. జూలై 20 వరకూ పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. అయితే ఆ తరువాత నుంచి పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.

జూలై 20 నుంచి జూలై 26 మధ్యకాలంలో కరోనా పాజిటివిటీ రేటు

జూలై 20 - 1.68%

జూలై 21 --- 2.27%

జూలై 22 --- 2.4%

జూలై 23 --- 2.12%

జూలై 24 --- 2.4%

జూలై 25 ---- 2.31%

జూలై 26 --- 3.4%