New Delhi, Feb 13: దేశంలో గత 24 గంటల్లో 12,143 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11,395 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 103 మంది కరోనా కారణంగా (Covid Deaths) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,550కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,00,625 మంది కోలుకున్నారు. 1,36,571 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 79,67,647 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,55,33,398 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,43,614 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తెలంగాణలో కొత్తగా 151 కరోనా కేసులు (Telangana Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 185 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,428 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,033 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,614గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,781 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 789 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,620 కరోనా పరీక్షలు (Andhra pradesh Coronavirus) నిర్వహించగా 68 కొత్త కేసులు వెల్లడయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 15 పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 11 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున వెల్లడయ్యాయి. అదే సమయంలో 106 మంది కరోనా నుంచి కోలుకోగా, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,760 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,784 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 814 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,162కి చేరింది.
కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న వారందరికీ, రెండో డోస్ (Corona Secon Dose) శనివారం నుంచి ఇవ్వనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సరిగ్గా గత 16వ తేదీన కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి డోస్ వేసుకున్న 28 రోజులకు రెండో డోస్ పొందాల్సి ఉంది. ఆ నియమం ప్రకారం ఇప్పటివరకు మొదటి డోస్ వేసుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోస్ వేసే ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రకటించారు.