Coronavirus in India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 14,306 మందికి కోవిడ్, కేరళలో తాజాగా 8,538 కేసులు నమోదు, 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసుకున్న భారత్
Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

New Delhi, October 25: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,306 కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. ఇదే సమయంలో 443 మంది (443 Deaths in Past 24 Hours) మహమ్మారి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,67,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 239 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో అత్యధిక కేసులు కేరళలో నమోదయ్యాయి. కేరళలో గత 24 గంటల్లో 8,538 కేసులు నమోదు కాగా... 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కి పెరిగాయి. ఇప్పటి వరకు 4,54,712 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

విజయవంతమైన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ భారతదేశ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. 100 కోట్ల డోసుల పంపిణీ పూర్తైన సందర్భంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. ఆదివారం మోదీ మన్‌ కీ బాత్‌లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అమృత మహోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ దేశభక్తి గేయాల పోటీని నిర్వహిస్తున్నదని చెప్పారు.

కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు

నవ భారతాన్ని ప్రతిబింబించేలా యువ త పాటలు రాయాలని పిలుపునిచ్చారు. రోమ్‌లో ఈ నెల 30-31వ తేదీల్లో జరగనున్న 16వ జీ-20 సదస్సు, గ్లాస్గోలో కాప్‌ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ 29న విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.