Covid Updates in India: వ్యాక్సిన్ తీసుకున్న ఆశ కార్యకర్తకు బ్రెయిన్‌ డెడ్‌, దేశంలో తాజాగా 14,849 మందికి కరోనా, ఏపీలో 158 కొత్త కేసులు, తెలంగాణలో 197 మందికి కోవిడ్ పాజిటివ్, ఇండియాకు కృతజ్ఞతలు తెలిపిన డబ్ల్యూహెచ్ఓ
Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, Jan 24: భారత్‌లో గత 24 గంటల్లో 14,849 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 15,948 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 155 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,339 కు పెరిగింది. దేశంలో కరోనా (Coronavirus in India) నుంచి ఇప్పటివరకు 1,03,16,786 మంది కోలుకున్నారు. 1,84,408 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 15,82,201 మందికి వ్యాక్సిన్లు వేశారు.

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 197 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 376 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,253కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,88,275 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,589కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,389 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1842 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో గత 24 గంటల వ్యవధిలో 43,770 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 158 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 23, విశాఖ జిల్లాలో 18 కేసులు గుర్తించారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు వచ్చాయి. అదే సమయంలో 172 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. ఆ మరణం విశాఖ జిల్లాలో నమోదైంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 8,86,852 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,78,232 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,473కి పడిపోయింది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,147కి చేరింది.

ఏపీలో తెగని పంచాయితీ లొల్లి, తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పిన ఏపీ సర్కారు

ఇండియా పెద్దమనసుతో ఇతర దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ ( Coronavirus Vaccine) డోసులు పంపడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ (Tedros Adhanom Ghebreyesus) భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో పోరాడుతున్న ప్రపంచానికి మద్దతుగా నిలుస్తున్నారంటూ కొనియాడారు. సమష్టి చర్యలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించగలమని, ప్రజల ప్రాణాలను, వారి జీవితాలను నిలపగలమని స్పష్టం చేశారు. భారత్... బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, సీషెల్స్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ వంటి ఆసియా దేశాలకే కాకుండా బ్రెజిల్ వంటి దూరదేశాలకు కూడా కరోనా టీకా డోసులు పంపింది.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి ఆశ కార్యకర్తకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు సమాచారం అందగా.. మరో ఏఎన్‌ఎం అస్వస్థతకు గురై కోలుకుంటోంది. తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం) గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)కి ఈ నెల 20న కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. తరువాత ఏఎన్‌ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్‌ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. దీంతో వారిద్దరినీ ఈ నెల 22న జీజీహెచ్‌లో చేర్చించారు.

జూలై 17వతేదీ వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్ ప్రభుత్వం, సందర్శకులు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ

ఆందోళన వల్ల ఏఎన్‌ఎం లక్ష్మికి రియాక్షన్‌ వచ్చిందని, చికిత్స అందించిన వెంటనే సాధారణ స్థితికి చేరుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉందని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు. ఆశ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురైనట్టు తేల్చారు. శనివారం రాత్రి ఆమెకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలావుండగా.. విజయలక్ష్మికి వేసిన వయల్‌ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడం గమనార్హం. డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌ జీజీహెచ్‌కు చేరుకుని వారిద్దరి పరిస్థితిపై ఆరా తీశారు.