COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, January 8: భారత్‌లో కొవిడ్ కేసులు చాలావరకు తగ్గుముఖంపట్టాయి, అదే సమయంలో అంతకుమించి కోలుకునే వారి సంఖ్య నమోదవుతుంది. ఈ క్రమంలో ఆక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 18,139 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,04,13,417కు చేరింది. నిన్న ఒక్కరోజే 234 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,50,570కు పెరిగింది.

అలాగే,  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,539 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,00,37,398 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 2,25,449 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.39% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 2.16%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక జనవరి 7 వరకు దేశవ్యాప్తంగా 17,93,36,364 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9,35,369 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డెలివరీ జరిగిందని, స్వీకరించేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సమాచారం పంపింది. అలాగే పలు రాష్ట్రాలు కూడా విజయవంతంగా వ్యాక్సిన్ పంపిణీ పట్ల డ్రిల్స్ పూర్తి చేశాయి.  ఇక వ్యాక్సిన్ పంపిణీకి తేదీలు ఖరారు చేయడం ఇప్పటికే మిగిలి ఉంది.