Coronavirus in India: ప్రతి పక్షాల జ్వరానికి కారణం చెప్పాలని డాక్టర్‌ను అడిగిన ప్రధాని మోదీ, దేశంలో తాజాగా 30,773 మందికి కరోనా, దేశవ్యాప్తంగా జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న వ్యాక్సినేషన్
PM Narendra Modi Takes COVID-19 Vaccine. (Photo Credits: Twitter@narendramodi)

New Delhi, Sep 19: దేశంలో కరోనా కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతక్రితం రోజుతో పోల్చితే తాజా కేసుల సంఖ్య కాస్త తగ్గి 30 వేలకు చేరింది. దేశంలో నిన్న కొత్తగా 30,773 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని (Coronavirus in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,34,48,163కి చేరింది. అలాగే, నిన్న 38,945 మంది కోలుకున్నార‌ని (38,945 recoveries) పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 309 మంది మృతి (309 deaths in the last 24 hours ) చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,44,838కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,26,71,167 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,32,158 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. కొవిడ్‌ టీకా కార్యక్రమం దేశవ్యాప్తంగా జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 80 కోట్ల మైలురాయిని దాటింది. నిన్న దేశంలో 85,42,732 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,43,72,331 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

మోదీ పుట్టిన రోజునాడు దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. రెండున్నర కోట్ల మందికిపైగా టీకా వేశారు. అది దాదాపు ఆస్ట్రేలియా జనాభాతో సమానం. అయితే, దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ గోవా వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన.. టీకా వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు.

జీఎస్టీ మీటింగ్ తరువాత ధరలు పెరిగేవి, తగ్గేవి ఏంటో తెలుసుకోండి, జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు తీసుకురాలేమని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 45వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే

ఇదే క్రమంలో రాజకీయ పార్టీలకూ వ్యాక్సిన్ దుష్పరిణామాలు తలెత్తుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. ‘‘వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు తెలిసింది. కానీ, నిన్న రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని తెలిసి రాజకీయ పార్టీలకూ జ్వరం పట్టుకుంది. దానికి కారణం ఏమై ఉండొచ్చంటారు?’’ అని ఓ వైద్యుడిని ఆయన అడిగారు. దీంతో ఆ డాక్టర్ తెగ నవ్వేశారు. వ్యాక్సిన్ తర్వాత కలిగే దుష్పరిణామాలపై లబ్ధిదారులకు సవివరంగా చెబుతున్నామని, వస్తే ఏం చేయాలో సూచనలు చేస్తున్నామని ప్రధాని మోదీకి డాక్టర్ వివరించారు.

వ్యాక్సినేషన్ డ్రైవ్ లో గోవా విజయవంతంగా ముందుకెళ్తోందని మోదీ కొనియాడారు. సీఎం ప్రమోద్ సావంత్ నేతృత్వంలో భారీ వర్షాలు, తుపాన్లు, వరదలను రాష్ట్రం ఎంతో సమర్థంగా ఎదుర్కొంటోందని ప్రశంసించారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను విజయవంతం చేస్తున్నందుకు ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సినేషన్ లో ఎదురైన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అడిగారు.

వ్యాక్సినేషన్‌లో చైనా రికార్డు బ్రేక్ చేసిన భారత్, దేశంలో తాజాగా 35,662 మందికి కోవిడ్, ప్రస్తుతం 3,40,639 కేసులు యాక్టివ్

ఆరోగ్య కార్యకర్తల శ్రమతో భారత్ అతిపెద్ద రికార్డ్ ను సొంతం చేసుకుందని, ఒకే రోజు రెండున్నర కోట్ల మందికి టీకాలు వేయగలిగామని ప్రధాని మెచ్చుకున్నారు. సంపన్న దేశాలు కూడా ఆ ఘనతను సాధించలేకపోయాయన్నారు. ప్రతి గంటకూ 15 లక్షల మందికి టీకాలు వేశామన్నారు. తన 72వ పుట్టినరోజు నాడు ఇలాంటి ఘనత సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాగా, అక్టోబర్ 10 నాటికి వంద కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.