Coronavirus in India (Photo-PTI)

New Delhi, July 6: దేశంలో నిన్న‌ 34,703 క‌రోనా కేసులు (Coronavirus Cases in India) న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 51,864 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,19,932కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 553 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,03,281కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,52,294 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 101 రోజుల క‌నిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 4,64,357 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 35,75,53,612 వ్యాక్సిన్ డోసులు వేశారు. క‌రోనా కేసుల రిక‌వ‌రీ రేటు 97.17 శాతంగా ఉంది.

ఆగస్టు రెండో వారంలో మూడో వేవ్‌ ప్రారంభం (Third COVID wave Likely to Hit Next Month) కావొచ్చని ఎస్బీఐ తన పరిశోధనాత్మక నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది. దేశంలో కరోనావైరస్ ఉద్ధృతిపై ఎస్బీఐ (SBI) ఎప్పటికప్పుడు అంచనాలను వెలువరిస్తున్నది. తాజాగా ‘కొవిడ్‌ 19: ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ధర్డ్ వేవ్ ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని తెలిపింది.

వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా నుంచి బయటపడగలం, కొవిన్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ, కోవిడ్‌పై పోరాటంలో టెక్నాల‌జీ పాత్రపై ప్రశంసలు కురిపించిన భారత ప్రధాని

ప్రస్తుత కేసులు, గణాంకాలను బట్టి జూలై రెండో వారంలో రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గుతుందని అందులో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. ఆగస్టు రెండో వారంలో కేసుల్లో పెరుగుదల ప్రారంభమై నెల వ్యవధిలోనే గరిష్ఠానికి చేరుకొంటాయి. సెకండ్‌ వేవ్‌ కన్నా థర్డ్‌ వేవ్‌లో 1.7 రెట్లు ఎక్కువ కేసులు నమోదు అవుతాయి.