New Delhi, November 3: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. భారత్‌లో గత 24 గంటల్లో 38,310 కరోనా కేసులు, 490 మంది మృతి (490 Deaths in Past 24 Hours) చెందినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో (Coronavirus in India) కలిపి భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి చేరింది.
దేశంలో ప్రస్తుతం 5,41,405 యాక్టివ్ కేసులు ఉండగా, 76,03,121 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 1,23,097 మంది మృతి చెందారు. రికవరీ రేటు కూడా భారత్‌లో (India Recovery Rate) మెరుగ్గా ఉండటం విశేషం. సోమవారం ఒక్కరోజే 58,323 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 91.96 శాతంగా నమోదు కాగా.. మరణాల రేటు 1.49 శాతంగా ఉంది.
హరియాణాలో రెండవ దశ ‘సీరో సర్వేలో 14.8శాతం ప్రజలలో యాంటీబాడీలను గుర్తించారు. ఈ సందర్భంగా హరియాణా ముఖ్యమంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనాకు దూరంగా ఉండేందుకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అక్కడ మళ్లీ లాక్‌డౌన్, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో రెండవదశ సీరో సర్వేను అక్టోబరులో నిర్వహించారని, ఇందుకోసం రాష్ట్రంలోని అన్నిజిల్లాలలో నుంచి 14,500 మంది నుంచి శాంపిల్స్ సేకరించారన్నారు. వీరిలోని 14.8శాతం మందిలో యాంటీ బాడీలు తయారయినట్లు స్పష్టమైందన్నారు. దీనికి ముందు నిర్వహించిన సీరో సర్వేలో 8 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయన్నారు. హరియాణాలోని గ్రామీణ ప్రాంతాల్లోని 11.4 శాతం, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లోని 19.8 శాతం మందిలో యాంటీ బాడీలను గుర్తించారన్నారు.
కరోనా టీకా కంటే ముందుగానే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) నుంచి ఔషధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండబ్ల్యు పేరుతో వచ్చే ఈ ఔషధం రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ ఔషధానికి సంబంధించిన మూడవ దశ హ్యూమన్ ట్రయల్స్‌కు కూడా అనుమతి లభించింది.
ఈ సందర్భంగా సీఎస్ఐఆర్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ విశ్వకర్మ మాట్లాడుతూ ఈ ఔషధానికి సంబంధించి నిర్వహించిన రెండు దశల ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మూడవ దశ ట్రయల్స్‌కు అనుమతి మంజూరయ్యింది. త్వరలోనే దేశంలోని 300 మందిపై ఈ ఔషధానికి సంబంధించిన ప్రయోగాలు చేపట్టనున్నామని తెలిపారు. ఎయిమ్స్, అపోలోతో పాటు ఎన్నిక చేసిన పలు ఆసుపత్రులలో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ మూడవ దశ ప్రయోగాలు విజయవంతమైతే వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ ఔషధం విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.