coronavirus in idnia (Photo-PTI)

New Delhi, Nov 1: దేశంలో గడిచిన 24 గంటల్లో 46,963 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (COVID-19 in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 81,84,082కు చేరింది. నిన్న ఒక్క రోజే 470 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,22,111 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 58,684 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 74,91,513మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.54 శాతంగానూ.. నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.97 శాతంగా ఉంది. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది.

తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి దురైక్కన్ను(72) కరోనాతో కన్నుమూశారు. శ్వాస ఇబ్బందులతో గత నెల 13న చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దురైక్కన్ను చేరారు. అనంతరం అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్యం మరింత విషమించింది. ఈ క్రమం‍లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి మృతిపట్ల తిమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మగవారిని మాత్రమే చంపేస్తోన్న కొత్త వ్యాధి, అంతుచిక్కని వ్యాధికి వెక్సాస్ సిండ్రోమ్‌గా నామకరణం చేసిన సైంటిస్టులు, అమెరికాలో పలువురు మృత్యువాత

కరోనా కేసులు పెరుగుతుండటంపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు నెల రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. శనివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ విషయమై జరిగిన చర్చిన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. గురువారం నుంచి ఇంగ్లండ్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌ 2 వరకు ఇది కొనసాగనున్నట్లు తెలిపారు. దేశంలో మరోసారి కరోనా ఉధృతి పెరగటంతో లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నామని మీడియాకు వెల్లడించారు.

శనివారం కొత్తగా బ్రిటన్‌ 22 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. యూకే వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తాజాగా 50,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 13,31,884 కేసులు నమోదు కాగా, 36,565 మంది మరణించినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది.