Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, September 1: దేశంలో 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,10,845కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,19,93,644 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 3,78,181 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,39,020 మంది మహమ్మారి వల్ల మృతిచెందారని వెల్లడించింది. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 460 మంది బాధితులు మరణింగా, 33,964 మంది కోలుకున్నారని తెలిపింది. ఒక్క కేరళలోనే 30,203 కేసులు నమోదవగా, 115 మంది (Covid Deaths) మృతిచెందారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. తాజాగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. గతవారం ఒక్కరోజులోనే కోటిమందికిపైగా టీకాలు వేసి రికార్డు నెలకొల్పగా, తాజాగా ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం ఒక్క రోజే రికార్డుస్థాయిలో 1.28 కోట్ల మందికిపైగా టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటివరకు 65 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేశారు.

మళ్లీ ఇంకో కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాతో సహా పలు దేశాల్లో కరోనా C.1.2 వేరియంట్ ని కనుగొన్న శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌కు సైతం ఈ కొత్త వేరియంట్ లొంగదని నివేదికలో వెల్లడి

50 కోట్ల మందికి తొలి డోసు, 15 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయింది. గత 24 గంటల్లో 1,33,18,718 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించింది. దీంతో మొత్తం 65,41,13,508 డోసులను పంపిణీ చేశామని తెలిపింది.