Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, October 13: భారత్‌లో గడచిన 24 గంటల్లో 55,342 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus in India) అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 706 మంది కరోనా (Coronavirus Outbreak) కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,09,856 కి (Corona Deaths) పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 62,27,296 మంది కోలుకున్నారు. 8,38,729 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 8,89,45,107 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ICMR) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,73,014 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,089 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 165 మంది కరోనా బాధితులు మృతి చెందారు. 15,656 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 2,12,439 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకూ ప్రతీరోజూ 10 వేలకు మించిన కేసులు నమోదయ్యేవి. అయితే సోమవారం మాత్రం 7,089 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 15,35,315 మందికి కరోనా సోకగా, వారిలో 12,81,816 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకూ మొత్తం 40,114 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కరోనా రికవరీ రేటు 83.49గా ఉండగా, డెత్ రేటు 2.64గా ఉంది.

ఆశలు ఆవిరవుతున్నాయా? జే అండ్‌ జే కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేత, అస్వస్థతకు గురైన వాలంటీర్, కీలక ప్రకటన చేసిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

ఇదిలా ఉంటే మనం నిత్యం ఉపయోగించే వస్తువుల ఉపరితలంపై కరోనా వైరస్‌ 28 రోజుల వరకు జీవించి ఉంటుందని ఆస్ట్రేలియా నేషనల్‌ సైన్స్‌ ఏజెన్సీ పరిశోధనలో వెల్లడైంది. కరెన్సీ నోట్లు, గ్లాసులు, స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులపై ఈ వైరస్‌ 28 రోజులదాకా జీవించే ఉంటుందని వారి పరిశోధనలో తేలింది. మనం నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, చేతులను సైతం శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచించారు.

కరోనాపై మళ్లీ షాకింగ్ నిజాలు, మనుషుల చర్మంపై 9 గంటల దాకా బ్రతికే ఉంటుంది, శీతాకాలంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం

తక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్‌ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందని, అలాగే సున్నితంగా ఉండే ఉపరితలాలపై దీని జీవన కాలం అధికమని పరిశోధనలో స్పష్టమైంది. ప్లాస్టిక్‌ నోట్ల కంటే కాగితపు కరెన్సీ నోట్లు కరోనా వైరస్‌ ఆవాసానికి అనుకూలమని చెప్పొచ్చు. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ వైరస్‌ సున్నితమైన ఉపరితలాలపై 28 రోజుల దాకా జీవించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇక సాధారణ వస్త్రంతో తయారుచేసిన మాస్క్‌ను ప్రతిరోజు తప్పనిసరిగా దాన్ని వేడినీటితో, వీలైతే వాషింగ్‌ మెషీన్‌లో ఉతకడం మరీ మంచిదని ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గతంలో ఈమేరకు సూచనలు జారీ చేసిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.