Coronavirus Outbreak | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, June 16: దేశంలో పలు రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలతో గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య లక్షకు దిగువనే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 62వేల మంది వైరస్‌ బారినపడగా.. లక్షకు పైనే కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 19,30,987 మందికి వైరస్‌ (India Reports 62,224 New COVID19 Cases) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 62,224 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.96కోట్లకు చేరింది. వరుసగా తొమ్మిదో రోజు పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువనే ఉంది.

ఇదే సమయంలో 1,07,638 మంది వైరస్‌ నుంచి కోలుకున్నాయి. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2.83కోట్లుగా ఉంది. రికవరీ రేటు 95.80శాతానికి పెరిగింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 9లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,65,432 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 2.92శాతంగా ఉంది. ఇక మరణాల సంఖ్య కూడా 3 వేలకు దిగువనే ఉంటడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో మరో 2542 మంది కరోనాకు (2542 Deaths in Past 24 Hours) బలయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,79,573 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 28లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో మొత్తం వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య 26కోట్లు దాటింది.

దేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ మరణం, అధికారికంగా ధృవీక‌రించిన ప్రభుత్వం, వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత అనఫిలాక్సిస్‌తో మరణించిన 68 ఏళ్ల వ్య‌క్తి

కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది. వ్యాక్సిన్ (Covid Vaccination) వేయించుకునేందుకు కో-విన్ యాప్‌లో రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని ప్ర‌క‌టించింది. స్మార్ట్ ఫోన్లు లేనివారు వ్యాక్సినేషన్ కోసం త‌మ పేరు ఎలా నమోదు చేసుకోగల‌ర‌నే ప్ర‌శ్న త‌లెత్తిన నేప‌ధ్యంలో దీనికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప‌రిష్కారం చూపింది. 18 సంవత్సరాలు దాటిన వ‌య‌సుగ‌ల వారెవ‌రైనా నేరుగా వారికి సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర‌కు వెళ్లి, అక్కడ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఆ త‌రువాత వారు వ్యాక్సిన్ వేయించుకోవ‌చ్చ‌ని, ఇదేవిధంగా 1075 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి కూడా వ్యాక్సిన్ కోసం పేరు న‌మోదు చేయించుకోవ‌చ్చని పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలతో 1.05 కోట్లకు పైగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కాగా దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య వేగంగా తగ్గుతోంది. దేశంలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో కొత్త‌గా 60,471 క‌రోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,95,70,881కు చేరుకుంది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో 2,726 మంది క‌రోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా మృతుల‌ సంఖ్య 3,77,031కి చేరింది. అలాగే ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,13,378గా ఉంది.