India Coronavirus: మళ్లీ పుంజుకుంటున్న కరోనావైరస్, దేశంలో భారీ స్థాయిలో నమోదవుతున్న కేసులు, తాజాగా 18,711 మందికి కరోనా, తెలంగాణలో కొత్తగా 158 కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం
Coronavirus in US (Photo Credits: PTI)

New Delhi, March 7: భార‌త్‌లో గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా నిర్ధారణ (Single-Day Spike of 18,711 New COVID-19 Cases) అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల (India Coronavirus) వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, 14,392 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,756 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,68,520 మంది కోలుకున్నారు. 1,84,523 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 2,09,22,344 మందికి వ్యాక్సిన్ (COVID-19 Vaccination) వేశారు.

తెలంగాణలో కొత్త‌గా 158 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక్క‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 207 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,900కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,373 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,641 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,886 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 748 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 30 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్, గుజరాత్‌లో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత ఆరోగ్య కర్తకు పాజిటివ్, యాంటీబాడీస్‌ అభివృద్ధికి 45 రోజులు సమయం పడుతుందని తెలిపిన వైద్యులు

దేశరాజధాని ఢిల్లీలో సుమారు రెండు నెలల తరువాత కరోనా వ్యాప్తి రేటు అత్యధికంగా నమోదవుతూ వస్తోంది. ఢిల్లీలో గడచిన వారంలో యాక్టివ్ కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో పాటు ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య కూడా అదికంగానే ఉంటోంది. ఢిల్లీలో వరుసగా రెండవ రోజు కూడా కరోనా కేసుల సంఖ్య 300 దాటింది. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 53,062 మంది కరోనా టెస్టులు చేయించుకున్నారు. వీరిలో 321 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చి 6న ఢిల్లీలో కరోనా వ్యాప్తి రేటు 0.60గా ఉంది. ఇది గడచిన 2 నెలల్లో అత్యధికం. మార్చి 6కు ముందు జనవరి 9న ఢిల్లీలో కరోనా వ్యాప్తి రేటు 0.65గా ఉంది. అదేవిధంగా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,779కి చేరింది.

చైనా వివాదాస్పద నిర్ణయం, కోవిడ్ పరీక్షల్లో భాగంగా మలద్వారం శుభ్రం చేసే టెస్ట్, విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు, చర్యను ఖండిస్తున్న పొరుగు దేశాలు

హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నవారి సంఖ్య 879కి చేరింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధికారి డాక్టర్ అజీత్ జైన్ మాట్లాడుతూ ఏప్రిల్ అనంతరం కరోనా కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని, మే నాటికి పీక్ స్టేజ్‌కు చేరవచ్చని అన్నారు. కరోనా బారిన పడుతున్నవారిలోని 45 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న 80 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో తగినన్ని పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

తమిళనాడులో ఈ నెల ప్రారంభం నుంచి కేసులు రోజురోజుకూ పెరుగుతన్నాయి. రాష్ట్రంలో గత 3వ తేదీన 499 మంది, 4వ తేదీన 490 కరోనా బారిన పడ్డారు. 5వ తేదీన ఆ సంఖ్య 543కు పెరిగింది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్లు, కోవై, తిరుప్పూర్‌తో తదితర జిల్లాల్లో కేసులు అనూహ్యంగా పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రాంతాల్లో సంచరించేవారికి జరిమానా విధిస్తామని, ఇందుకోసం అధికారులను ప్రత్యేక పర్యవేక్షణకు నియమించినట్టు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ ప్రకటించారు.