New Delhi, April 11: నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ (Pakistan) కాల్పుల విరమణను ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా భారత దళాలు (Indian Army) సరిహద్దు మీదుగా "టెర్రర్ లాంచ్ ప్యాడ్" (Terror Launch Pads) లపై ఖచ్చితమైన దాడులను ప్రారంభించాయి. కుప్వారా జిల్లాలోని (Kupwara) కేరన్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం దుర్భుద్ధితో కాల్పులు జరిపిన తరువాత తరువాత ఈ ప్రతీకార దాడి జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరాలను నాశనం చేయడం ద్వారా భారత సైన్యం పాక్ పై ప్రతీకారం తీర్చుకుంది.
ఇండియన్ ఆర్మీ సాహసోపేత ఆపరేషన్
భారత సరిహద్దు మీదుగా ఉగ్రవాదులను పంపే దుర్మార్గపు కుట్రకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీకి చెందిన బోఫోర్స్ ఫిరంగులు తగిన బుద్ధి చెప్పాయి. పాక్ డ్రోన్ విమానంపై దాడి చేసిన ఉదంతానికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ విడుదల చేసింది. తద్వారా భారత సైన్యం పాకిస్తాన్ కు స్పష్టమైన హెచ్చరిక చేసింది.. మేము ఉగ్రవాదులు చంపడమే కాదు... దానిని ప్రపంచానికి చూపిస్తామని పేర్కొంది.
Here's Video
#WATCH Video shot from drone as Indian army precision targets Pakistani terror launch pads (video source: Indian Army) pic.twitter.com/gjTtbARadv
— ANI (@ANI) April 10, 2020
బాలకోట్ వైమానిక దాడి తరువాత పాకిస్తాన్ భయపడి, భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులను మోహరించడాన్ని తగ్గించింది. అయితే, ఇప్పుడు పాక్ మళ్ళీ తోక జాడించింది. ఇటీవల ఉత్తర కాశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడిన ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో భారత సైన్యానికి చెందిన ఐదుగురు జవానులు అమరులయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు.
పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే
పాకిస్తాన్ సాగించిన ఈ పిరికిపంద చర్యకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద రహస్య స్థావరాన్ని భారత సైన్యం ఫిరంగులతో ధ్వంసం చేసింది. భారత సైన్యం చాలా రోజులుగా ఈ ప్రాంతంపై దృష్టి పెట్టింది. ఇప్పుడు బోఫోర్స్ ఫిరంగుల సహాయంతో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసింది.
నూతన ఆర్మీ జనరల్ ఎమ్ ఎమ్ నరవణే
ఈ దాడిలో భారత సైన్యానికి ఎటువంటి నష్టం జరగలేదు. సాధారణంగా భారత సైన్యం ఇటువంటి దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చేయదు. కానీ ఈసారి ఆర్మీ డ్రోన్ నుండి తీసిన వీడియోను విడుదల చేసింది. పాక్ ఇంకా ఉగ్రవాదులను పంపడం కొనసాగిస్తే బాలకోట్ లాంటి దాడులు కొనసాగుతాయని భారత సైన్యం పాకిస్తాన్ కు హెచ్చరిక చేసింది.
ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్ ముకుంద్?
చొరబాటుదారుల కదలికలను ఏప్రిల్ 1 న రాడార్ ద్వార ఇండియన్ ఆర్మీ గుర్తించింది. వారి కదలికలను గుర్తించిన సైన్యం అప్రమత్తమై ఆ ఉగ్రవాదుల కదలికలను పసిగడుతూ వచ్చింది. ఏప్రిల్ 5 న, ముష్కరులు మరియు సైనిక సిబ్బంది కేరన్ సెక్టార్‌లోని ఒక నల్లాలో చిక్కుకున్నారు, అక్కడ వారిని ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు, భారత బలగాలకు చెందిన ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అమరవీరులను సుబేదార్ సంజీవ్ కుమార్, హవిల్దార్ దేవేంద్ర సింగ్, పారాట్రూపర్లు బాల్ క్రిషన్, అమిత్ కుమార్, ఛత్రపాల్ సింగ్లుగా గుర్తించారు.