Masks | Representational Image (Photo Credit: PTI)

New Delhi, April 17: కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోయిన, రైళ్లలో, స్టేషన్ లలో ఉమ్మివేసిన రూ.500 జరిమానా (Indian Railways to Fine) విధించనున్నట్లు పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన కొనసాగుతాయని రైల్వేశాఖ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబందనలు పాటించాలని పేర్కొంది.

వలస కార్మికులు దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలు కావడంతో.. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని భయంతో కార్మికులంతా మళ్లీ ఇళ్లకు పయనమవుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరలా వారివారి రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కరోనా కట్టడికి (Rail Passengers Up to Rs 500 for Not Wearing Masks ) ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తమ స్వంత రాష్ట్రాలకు వస్తున్న కార్మికులకు ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

ఇక కరోనా వైరస్‌ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌ అమలు, చేయాలని ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh) నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 15 దాకా లాక్‌డాన్‌ అమల్లో ఉంటుంది. యూపీలో మాస్క్‌ ధరించకుండా రెండోసారి పట్టుబడితే రూ.10,000 జరిమానా విధిస్తారు. మాస్క్‌ లేకుండా మొదటిసారి జరిమానాను రూ.1,000 పెంచారు. లాక్‌డౌన్‌ కాలంలో పారిశుధ్య, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తారు. వీక్లీ లాక్‌డౌన్‌లో భాగంగా మే 15 దాకా శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యలయాలను మూసివేస్తారు.

తుమ్మినా, దగ్గినా కరోనా, గాలి నుంచి వేగంగా శరీరంలోకి, ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, బ్రిటన్‌కు పాకిన ఇండియా డబుల్ మ్యూటెంట్ వైరస్, రెండోసారి కరోనా బారిన సీఎం యెడ్డ్యూరప్ప, దేశంలో తాజాగా 2,34,692 మందికి కోవిడ్

కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల మే 15 వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులు ఒక్కరోజులో భారీగా పెరగడంతో రాష్ట్ర బోర్డు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు నిన్న రాష్ట్రం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో గురువారం 104 మరణాలు, 22,439 తాజా కేసులు నమోదయ్యాయి. లక్నో, ప్రయాగ్రాజ్, వారణాసి, కాన్పూర్ నగర్, గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్, మీరట్, గోరఖ్‌పూర్ సహా 2 వేలకు పైగా క్రియాశీల కేసుల గల మొత్తం 10 జిల్లాల్లో రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కరోనా కర్ఫ్యూ అమలులోకి వస్తుందని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. దేశంలో 2,17,353 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.