COVID-19 Cases in India: దేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుతోంది, 24 గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు నమోదు, భారత్‌లో 12 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, July 22: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 తాజా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనావైరస్ కేసుల సంఖ్య (COVID-19 Cases in India) 11,92,915కు ఎగబాకింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరట ఇస్తోంది. దేశంలో మొత్తం 4,11,133 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రాణాంతక వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య (Coronavirus deaths in india) 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఎన్‌–95 మాస్కులతో కరోనా వస్తోంది, హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం, గుడ్డతో తయారు చేసిన మాస్కులు వాడటమే ఉత్తమమంటూ సూచన

కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలో (Maharashtra Coronavirus) అత్యధికంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్‌ దాటింది. మహారాష్ట్రలో అత్యధికంగా 3,27,031 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12,276 మంది చనిపోయారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 1,80,643 మందికి కరోనా సోకింది. ఢిల్లీలో 1,25,096 కేసులు, కర్ణాటకలో 71,069, ఆంధ్రప్రదేశ్‌లో 58,668, యూపీలో 53,288 గుజరాత్‌లో 50,465, తెలంగాణలో 47,704 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీ (Delhi Coronavirus) జనాభాలో 23 శాతం మందిలో కరోనా వైరస్‌ యాంటీబాడీలు ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో తేలింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (SSDC), ఢిల్లీ సర్కారు కలిసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జూన్‌ 27 నుంచి జూలై 10 నడుమ దశలవారీగా 21,387 మంది రక్తనమూనాలను సేకరించి యాంటీబాడీ పరీక్షలు (సీరొలాజికల్‌ సర్వే) నిర్వహించారు. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా ఢిల్లీలో 23 శాతం మంది ఇటీవలికాలంలో వైరస్‌ బారిన పడినట్టు తేల్చారు.  కరోనా వ్యాక్సిన్‌పై చిగురిస్తున్న కొత్త ఆశలు, ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రకటించిన ఆక్స్‌ఫర్డ్, ట్వీట్ చేసిన ది లాన్సెట్ ఎడిటర్

దేశంలో ఈనెల‌లో ఇప్ప‌టికే 6 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇది ఇంతకుముందు నెలల్లో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. జూన్ 30 నాటి వ‌ర‌కూ దేశంలో ఈ వ్యాధి బారిన‌ప‌డిన‌వారి సంఖ్య 5.9 లక్షలు. ఈ నెలలో కరోనా కారణంగా ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 11 వేల మంది మరణించారు. దేశంలో చోటుచేసుకున్న‌ మొత్తం మరణాలలో ఇది 40 శాతం. కరోనా మరణాల సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో ఏడవ స్థానానికి చేరుకుంది.

దేశంలో కోవిడ్‌–19 మరణాల రేటు ( Covid 19 Deaths Rate) గణనీయంగా తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. జూన్‌ 17వ తేదీన 3.36 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.43 శాతానికి పడిపోయిందని పేర్కొంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించింది. దేశంలో 24 గంటల్లో మరో 37,148 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 11,55,191కు చేరుకున్నాయని తెలిపింది. యాక్టివ్‌ కేసులు 4,02,529 కాగా, కోలుకున్న బాధితుల సంఖ్య కూడా 7,24,577కు చేరుకుని, రికవరీ రేటు 62.72 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.

దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్‌ రేటు జాతీయ స్థాయి 8.07 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. రోజుకు ప్రతి 10 లక్షల జనాభాకు 140 పరీక్షలు చేస్తే పాజిటివ్‌ రేటు క్రమంగా 5కు, అంతకంటే తక్కువకు దిగి వస్తుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19తో ప్రతి 10 లక్షల మందిలో సరాసరిన 77 మంది చనిపోతుండగా, భారత్‌లో అది 20.4 మాత్రమేనని కేంద్రం పేర్కొంది. ఈ నెల 20వ తేదీ వరకు దేశంలోని వివిధ ల్యాబ్‌ల్లో 1,43,81,101 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

వైరస్‌ విస్తృతితో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్నాయి. వారం రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉన్న బెంగళూర్‌ నగరంలో బుధవారం నుంచి సాధారణ కార్యకలాపాలకు అనుమతించనున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లపై జరుగుతున్న హ్యుమన్‌ ట్రయల్స్‌ విజయవంతమవుతుండటంతో వ్యాక్సిన్ల రాకపై ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య (Global Coronavirus) కోటి 50 లక్షలు దాటింది. మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,50,94,630 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 6,19,520 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 91,10,972 మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 40,28,569 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,44,953 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 18,86,583 మంది కోలుకున్నారు.