Representational Image (Photo Credits: PTI)

భారత్‌లోని విద్యా విధానం, యువకుల డిగ్రీలు గురించి అమెరికాలోని బ్లూమ్‌బెర్గ్ చెందిన ఓ టాలెంట్‌ అసెస్‌మెంట్‌ సంస్థ వీబాక్స్‌ సంచలన సర్వే చేసింది.భారతదేశం యొక్క $117 బిలియన్ల (దాదాపు రూ.900 కోట్లు) విద్యా పరిశ్రమలో వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. కొత్త కళాశాలలు విపరీతమైన వేగంతో పుట్టుకొస్తున్నాయి.అయినప్పటికీ యువత ఎలాంటి నెపుణ్యాలు లేని గ్యాడ్యుయేట్లుగా మిగిలిపోతున్నారని సర్వే తెలిపింది. ఇదే భారత ప్రధాన ఆర్ధిక వ్యవస్థను అణగదొక్కుతున్నారని తెలిపింది. చాలామంది నిపుణులను ఇంటర్యూ చేసిన తర్వాత బ్లూమ్‌బెర్గ్ ఈ అధ్యయనం వెలువరించింది.

ఎట్టకేలకు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఈ యువకుల్లో కొందరు రెండు, మూడు డిగ్రీలు చేస్తున్నారని తెలిపింది. వారు చిన్న అపార్ట్‌మెంట్ భవనాల లోపల లేదా మార్కెట్‌ప్లేస్‌లలోని దుకాణాల లోపల కనిపించే కళాశాలలకు ఆకర్షితులవుతారు. ఉద్యోగ నియామకాలకు హామీ ఇచ్చే సంస్థల కోసం హైవేలు బిల్‌బోర్డ్‌లతో నిండి ఉన్నాయని తెలిపింది. కుప్పలు తెప్పలుగు పుట్టుకొస్తున్న ప్లేస్‌మెంట్‌లు ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌ల వైపు ఆకర్షితులై వేలకు వేలు డబ్బు వెచ్చించి..చివరి ఉద్యోగాలు లేక నానాపాట్లు పడుతున్నారని పేర్కొంది.

జాగ్రత్తగా ఉండాల్సిందే, తెలుగు రాష్ట్రాలకు హీట్‌వేవ్ అలర్ట్, మరో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించిన ఎఐండి

ఆల్ఫాబెట్ ఇంక్ యొక్క సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సీఈో సత్య నాదెళ్ల వంటి గ్లోబల్ బిజినెస్ చీఫ్‌లను భారతదేశం మరచిందని..వారికి భారత్‌లోని అత్యున్నత విద్యా సంస్థల్లో చోటు దక్కకపోవడం అత్యంత విచిత్రం అని కూడా పేర్కొంది. స్పెక్ట్రమ్ యొక్క మరొక చివరలో సాధారణ తరగతులు లేని వేలాది చిన్న ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, అవి తక్కువ శిక్షణతో ఉపాధ్యాయులను నియమించుకుంటాయి. కాలం చెల్లిన పాఠ్యాంశాలను ఉపయోగిస్తాయి. ఆచరణాత్మక అనుభవం లేదా ఉద్యోగ నియామకాలను అందించవని సర్వే తేల్చి చెప్పింది.

అందువల్ల అలాంటి సంస్థల్లో డిగ్రీలు చేసిన ఎలాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉండకపోవడంతో నిరుద్యోగులు మిగిలిపోతున్నట్లు వీబాక్స్‌ వెల్లడించింది. కానీ భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద జనాభాను కలిగి ఉన్న దేశమని, ఎక్కువ మంది యువకుల ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు గూర్చి ఆర్భాటంగా చెబుతుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా, విద్యార్ధులు డిగ్రీపై రాబడి మరియు ఖర్చుపై ఎక్కువగా ఆలోచిస్తున్నారు. లాభాపేక్షలేని సంస్థలు ప్రభుత్వ పరిశోధనలను ఎదుర్కొన్న USలో సహా ఉన్నత విద్య తరచుగా ప్రపంచవ్యాప్తంగా వివాదానికి దారి తీస్తుంది. అయినప్పటికీ భారతదేశంలో విద్య యొక్క సంక్లిష్టతలు చాలా తీవ్రంగా ఉన్నాయని తెలిపింది.

గర్భవతిని రేప్ చేసిన ఆ 11 మందిని ఎందుకు విడుదల చేశారు, బిలిస్క్‌ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, పూర్తి వివరాలు ముందుంచాలని ఆదేశాలు

వృద్ధి పరంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా దూసుకువెళ్తున్నప్పటకీ ..నిరుద్యోగం 7% కంటే ఎక్కువ ఉందని సర్వే పేర్కొంది. ఇదే దాని ప్రధాన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని కూడా తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఇది ఒక పెద్ద సవాలుగా ఉందని వెల్లడించింది. భారత్‌లోని విద్యా వ్యవస్థలో పలు లోపాలను ప్రస్తావిస్తూ..విద్యార్థులకు క్లాస్‌రూమ్‌ నాలెడ్జ్‌ తప్ప ప్రాక్టీకల్‌ నాలెడ్జ్‌ లేకుండా చేయడంతో ఉద్యోగాలు రాక పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వే పేర్కొంది.

మధ్య భారతదేశంలోని 2.6 మిలియన్ల జనాభా కలిగిన భోపాల్ వంటి నగరాల్లో దేశంలోని విద్యారంగంలో బూమ్ యొక్క సంక్లిష్టతలు కనిపిస్తాయి.యువకులకు డిగ్రీలు, ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రైవేట్ కాలేజీలతో పెద్దఎత్తున బోర్డులు వెలిశాయని సర్వే తెలిపింది. వారిలో చాలామంది డిగ్రీలో పొంది ఎటువంటి జాబులు లేకుండా ఖాళీగా ఉన్నారని నివేదిక తెలిపింది. చాలా మంది విద్యార్థులను ఇంటర్యూ చేయగా ఇదే విషయాన్ని వెల్లడించారని అందులో తెలిపింది.

కొన్ని పేరున్న మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులు లేకుండానే అడ్మిషన్లు ఇచ్చి వారిని ఎలా మోసం చేస్తున్నారో కూడా వివరించింది. అయినప్పటికీ విద్యార్థులు అలాంటి కాలేజీల్లోనే ఏదో రకంగా జాయిన్‌ అయిపోతున్నారని, డిగ్రీ సంపాదిస్తే చాలు అన్నట్లు ఉంటున్నారని చెప్పుకొచ్చింది. భారతదేశంలోని మొత్తం గ్రాడ్యుయేట్లలో సగం మంది విద్యావ్యవస్థలో సమస్యల కారణంగా భవిష్యత్తులో ఉపాధి పొందలేరని వీబాక్స్ అధ్యయనంలో తెలిపింది.

యువకుల సాధిస్తున్న డిగ్రీలు విలువలేనివని, దీంతో ఏటా మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ డీన్‌, ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేసే సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డు ఆప్‌ ఎడ్యకేషన్‌ మాజీ సభ్యుడు అనిల్‌ సద్గోపాల్‌ అన్నారు. అలాగే మానవ వనరుల సంస్థ ఎస్‌హెచ్‌ఎల్‌ చేసిన ఒక అధ్యయనంలో కేవలం 3.8% ఇంజనీర్లు మాత్రమే స్టార్టప్‌లలో సాఫ్ట్‌వేర్ సంబంధిత ఉద్యోగాలలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారని గుర్తించింది.

అంతేగాదు ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్,ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ..ఐటి పరిశ్రమలో ఉద్యోగం సంపాదించాలంటే గ్రాడ్యుయేట్‌లకు ముందు శిక్షణ అవసరం. చాలామంది గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వారందరికీ ఉద్యోగం చేసే నేపుణ్యాలు లేవన్నారు.అందువల్లే ఏటా నిరుద్యోగుల ఎక్కువ అవుతున్నారని ఇది అత్యంత ప్రమాదకరమైని అన్నారు. ఉద్యోగాలు లేక నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.

ఇండియా బ్రాండ్‌ ఈక్వీటీ ఫౌండేషన్‌ ప్రకారం భారత్‌లో విద్యా పరిశ్రమ అధ్యయనం ప్రయకారం భారత్‌లో 2025 నాటికి విద్యారంగం కోసం దాదాపు రూ. 1800 ​ కోట్లు కేటాయిస్తుందని అంచనా. ఇది యూఎస్‌లోని విద్యా సంస్థలతో పోలిస్తే తక్కువే. భారత్‌లో విద్యపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో 2.9% వద్దే నిలిచిపోయిందని, ఇది ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యం కంటే చాలా తక్కువే అని ఈక్వీటి ఫౌండేషన్‌ వెల్లడించింది.

పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యం సెట్లు ప్రస్తుతం మార్కెట్లో సులభంగా అందుబాటులో లేనందున మేము నియామకంలో సవాలును ఎదుర్కొంటున్నాము" అని MG మోటార్ ఇండియాలో మానవ వనరుల డైరెక్టర్ యశ్విందర్ పాటియల్ అన్నారు.