A special chartered flight will take them to Punjab's Amritsar. (Representational)

New Delhi, June 4: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం అంతర్జాతీయ విమాన సర్వీసులు (International Flight Operations) తిరిగి ప్రారంభం కానున్నాయి. జులై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ (Aviation ministry) వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో నిలచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన హైదరాబాద్, వలస కార్మికులు లేక కుదేలయిన అన్ని రంగాలు, వారిని తిరిగి పనుల్లోకి రప్పించుకునేందుకు నానా అగచాట్లు

ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాం. పరిస్థితి కొంచెం సాధారణం కాగానే వెంటనే ప్రారంభించాలని నిర్ణయించాం.... ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడుతూ.. పునః ప్రారంభిస్తాం’’ అని విమానయాన శాఖ చెప్పినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూనే... అంతర్జాతీయ విమానాల రాకపోకలను జూన్ 30 వరకూ నిషేధిస్తూ... కేంద్రం ఉత్తర్వును వెలువరించింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలను పునరుద్ధరించడం వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వాటన్నింటినీ బేరీజు వేసుకొన్న తర్వాతే... జూలై నుంచి ప్రారంభించాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆరు వేలు దాటిన మృతుల సంఖ్య, దేశంలో కొత్త‌గా 9304 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 2,16,919కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9000కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు 2 లక్షల 20 వేలకు చేరువలో ఉన్నాయి.