Janasena Chief Pawan Kalyan Meets BJP Working President Jagat Prakash Nadda (Photo-ANI)

New Delhi,January 13: జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో (Delhi) బీజేపీ(BJP) వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను(Jagat Prakash Nadda) కలిసారు. ప్రధానంగా వీరిద్దరి మధ్య ఏపీ రాజకీయాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, అలాగే బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ , ఎంపీ తేజస్వీ సూర్య కూడా నడ్డాను కలిసిన వారిలో ఉన్నారు.

ఏపీ 3 రాజధానుల (3 Capitals Row) వ్యవహారంపై బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వివరించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా కాకినాడకు (Kakinada)జనసేనాధి నేత రానున్నారు. ఇప్పటికే కాకినాడ వస్తున్నట్లుగా ప్రెస్ నోట్ విడుదల చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి (kakinada mla dwarampudi ) వ్యాఖ్యలపై భగ్గుమన్న జనసైనికులు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో వ్యవహారం మరింత ముదిరింది. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసింది కాక.. మళ్లీ వారిపై అక్రమ కేసులు పెట్టడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

Here's ANI Tweet

ఈ రోజు కాకినాడ లో జరిగిన సంఘటన కి పోలీస్ శాఖ వారు,అసలు కారకులైన వైసీపీ నాయకులని వదిలేసి , జనసేన నాయకులూ మీద అన్యాయంగా IPC సెక్షన్ 307 పెడితే, నేను ఢిల్లీ మీటింగ్ ముగించుకొని , నేరుగా కాకినాడకే వస్తాను, అక్కడే తేల్చుకుంటాము’అంటూ ట్వీట్ చేశారు.

Here's Pawan Kalyan Tweet

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అసభ్య పదజాలంతో పవన్‌ను దూషించడాన్ని నిరసిస్తూ.. జనసేన కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే నివాసం ముట్టడికి ప్రయత్నించారు. కొందరు కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి వద్దకు చేరుకోగా.. వారిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ సమయంలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో స్పెషల్‌ బ్రాంచ్ పోలీసులను రెండు వర్గాలను చెదరగొట్టాయి.