Newdelhi, July 28: భారీ వర్షాలకు (Heavy Rains) దేశ రాజధాని ఢిల్లీ (Delhi) అతలాకుతలం అవుతున్నది. వరదధాటికి హస్తిన ప్రజలు అస్తవ్యస్తం అవుతున్నారు. నగరంలోని రాజేందర్ నగర్ లో ఉన్న ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్ లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే ముగ్గురు విద్యార్థులు మరణించడం దురదృష్టకరం. మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. ఇతరుల కోసం గాలిస్తున్నారు. అయితే, బేస్ మెంట్ లో వెలుతురు లేకపోవడం, నీరు నిండిపోవడం.. సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది.
3 Students dead after flooding in Delhi coaching centre basement.
@SakshiBajaj19 reports. pic.twitter.com/yBevPATCZ8
— NDTV News feed (@ndtvfeed) July 28, 2024
పరారీలో కోచింగ్ సెంటర్ ఓనర్
ప్రమాద ఘటన తెలియగానే, కోచింగ్ సెంటర్ ఓనర్ పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా సీనియర్ అధికారులు ఘటనా స్థలంలోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాజకీయంగా ఈ ఘటన పెద్ద దుమారాన్ని రేపుతున్నది.