Pathanamthitta, Dec 14: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 27 రోజుల పసికందును ఓ కర్కశ తల్లి దారుణంగా (Kerala Mother kills 27-day-old baby) చంపేసింది. పసిబిడ్డ అనారోగ్యంతో బాధపడటం అలాగే ఎప్పుడూ ఏడుస్తుండటంతో ఆ తల్లి దారుణంగా హతమార్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలో నెలలు పూర్తిగా నిండకుండానే జన్మించిన ఓ శిశువు ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉండేది. దీంతో కొన్నిరోజులుగా ఆ శిశువు అనారోగ్యంతో బాధపడుతోంది.
ఇక చేసేదేమి లేక ఆ బిడ్డ తల్లి శిశువుని తీసుకొని ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి, వారి సూచించిన మేరకు పలు పరీక్షలు, మందులు కూడా తీసుకుని ఇంటికి రావడం ఇదే పనిగా మారింది. అయినా ఆ శిశువుకి ఏ మాత్రం అనారోగ్యం తగ్గకపోవడం, మరో పక్క ఏడూస్తూనే ఉండడంతో బిడ్డ మరింతగా ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
కాగా ఆ శిశువు తల్లి ఒక ఆశ్రమంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆ ఆశ్రమం నడుపుతున్న ఫాదర్ జోజి థామస్‌కు శిశువు హఠాత్తుగా మరణించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పోస్ట్‌మార్టం తర్వాత, ఒక పోలీసు అధికారి సర్జన్‌తో మాట్లాడగా, పసికందు తల వెనుక భాగంలో గాయాలు ( bangs his head against wall for crying) ఉన్నాయని తెలుసుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు శిశువు తల్లిని విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది.
పసికందు తండ్రికి ఇదివరకే పెళ్లయిందని, ఈ విషయం తెలిసినప్పటికీ తాను అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఆ శిశువుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తాను కొంత మానసిక అసౌకర్యానికి గురైనట్లు, చివరికి కోపంతో తానే కొట్టడంతో శిశువు చనిపోయిందని అంగీకరించింది. బిడ్డను తల్లే హత్య చేసిందని తేలడంతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కొట్టాయంలోని ఓ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న మహిళ తన ప్రేమికుడిని ఫోన్‌లో కలిశారని, అనారోగ్యంతో ఉన్న పసికందు తన తదుపరి చదువుకు హాని కలిగిస్తుందని అందుకే ఆమె తన బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.