Mumbai, pril 17: కరోనావైరస్ దేశంలో పంజా విసురుతున్న వేళ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహిస్తుండటంపై ముంబై మేయర్ కిషోరీ పెడ్నేకర్ అసహనం వ్యక్తంచేశారు. కుంభమేళా నిర్వహించడంవల్లే ఇప్పుడు అక్కడ కరోనా మహమ్మారి వేగంగా ప్రబలుతున్నదని ఆమె ఆరోపించారు.
కుంభమేళాకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వెళ్లారని, ఇప్పుడు వారంతా తమతమ రాష్ట్రాలకు తిరిగి వెళ్లి కరోనా వైరస్‌ను ప్రసాదంలా పంచిపెడుతారని (Kumbh Mela Returnees Will Distribute Coronavirus as 'Prasad) విమర్శించారు.
ముంబైకి తిరిగి వచ్చిన కుంభమేళా భక్తులందరినీ వారి ఖర్చులతోనే క్వారంటైన్ లో పెడతాం’’ అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కుంభమేళా భక్తులను క్వారంటైన్ చేయాలని ఆమె (BMC Mayor Kishori Pednekar) సూచించారు. ఆ ఖర్చులనూ వారే భరించేలా చేయాలన్నారు.అంతేగాకుండా చిన్న చిన్న ఆంక్షలు పెడితే సరిపోవని, కరోనాను కట్టడి చేయాలంటే ముంబైలో పూర్తి లాక్ డౌన్ పెట్టాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయన్నారు.
95 శాతం ముంబై జనాలు కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారని, పాటించని మిగతా ఆ ఐదు శాతం మందితోనే కరోనా విజృంభిస్తోందని చెప్పారు. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 1 వరకు అది కొనసాగనుంది.