Hyderabad, Nov 4: ఆత్మార్పణ అంటూ తెలంగాణలో (Telangana) గత కొన్నిరోజులుగా హల్ చల్ చేసిన లేడీ అఘోరీ (Lady Aghori Naga Sadhu Row) ఏపీలో ప్రత్యేక్షమైంది. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ కారును స్థానికులు వెంబడించారు. దీంతో కారు నిలపకుండా శ్రీశైలం వైపు అఘోరీ వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. కాగా, తెలంగాణలో గత కొద్ది రోజులుగా లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సనాతన ధర్మం కోసం సికింద్రాబాదు ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణం చేస్తానని మహిళా అఘోరీ ప్రకటించడం సంచలనంగా మారింది.
Here's Video:
తెలంగాణలో హల్చల్ చేసిన అఘోరీ ఏపీలో ప్రత్యేక్షం
అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన లేడీ అఘోరీ
అఘోరీ కారును వెంబడించిన స్థానికులు
కారు నిలపకుండా శ్రీశైలం వైపు వెళ్లిన అఘోరీ
ఇటీవల తెలంగాణలో హల్చల్ చేసి మహారాష్ట్రకు వెళ్లినట్టు సమాచారం
అక్కడి నుంచి నేరుగా ఏపీకి ఎంటర్ అయిన… pic.twitter.com/G05DK53PSz
— BIG TV Breaking News (@bigtvtelugu) November 4, 2024
మహారాష్ట్ర నుంచి ఏపీకి..
అఘోరీ ప్రకటన నేపథ్యంలో పోలీసులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లిలోని ఆమె స్వగృహంలో అఘోరీని నిర్బంధించారు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి మండలం లకడికోటా వరకు తీసుకెళ్లి అఘోరిని వదిలేశారు. అయితే, ఆమె అటు నుంచి ఏపీలో ప్రవేశించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
క్యూఆర్ కోడ్ తో కాకతీయుల చరిత్ర.. చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకే..!