Lok Sabha Elections 2024: తొలి రెండు గంటల్లో పిఠాపురంలో 10.02 శాతం పోలింగ్ నమోదు, ఉదయం 9 గంటలకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపిన అధికారులు
Polling (Photo-ANI)

తెలుగు రాష్ట్రాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరుగుతోంది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్‌ నమోదైంది.  తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్ర‌జ‌లు పోలింగ్‌లో పాల్గొనాల‌ని పిలుపు

ఏపీలో అత్యధికంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో 12.09శాతం, అత్యల్పంగా గుంటూరులో 6.17శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 13.22శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 5.06శాతం పోలింగ్‌ నమోదైంది. తొలి రెండు గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 9.21శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు కుప్పంలో 9.72శాతం ఓటింగ్‌ నమోదైంది. మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10.02శాతం, పులివెందుల 12.44శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.