LPG sees price drop of more than Rs 160 per cylinder (Photo-PTI)

New Delhi, De 2: సామాన్యుడిపై మరోసారి అయిల్ కంపెనీలు గుదిబండను (LPG Prices Hiked) మోపాయి.. ఇప్పటికే పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. ఇప్పటికే ధరలమోత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మద్య దేశంలో వంట గ్యాస్ భారం కూడా పెరగనుంది.దేశంలో వరుసగా చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను (LPG cylinder prices hiked in December 1) పెంచాయి. రాయితీ గ్యాస్‌ సిలిండర్‌‌ ధరలను (LPG cylinder prices) భారీగా పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనపు భారం పడనుంది.

పెరిగిన ధరలు వెంటనే డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కు చేరింది. కాగా, దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్‌ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరే అవకాశం ఉంది. అటు, అయిల్ కంపెనీల నిర్ణయంతో జనం ఆందోళనకు గురవుతున్నాయి.

ఏపీలో ఇంటికే రేషన్ సరుకులు, జనవరి 1 నుంచి మినీ వ్యాన్‌ ద్వారా డోర్‌ డెలివరీ, డ్రైవర్లకు ఉపాధి కల్పించనున్న ఏపీ ప్రభుత్వం

దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ ఐఓసీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ధర ప్రకారం ఢిల్లీలో ధరలు వంట గ్యాస్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 594 రూపాయలుగా ఉండగా ముంబైలో సిలిండర్ ధర రూ .594. చెన్నైలో 610 రూపాయలు, కోల్‌కతాలో రూ. 620 గా ఉంది. ఇక 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధర పెరిగింది. చెన్నైలో అత్యధికంగా సిలిండర్‌కు 56 రూపాయల చొప్పున భారం పడగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాలలో 55 రూపాయలు పెరిగింది.