Amaravati, Dec 2: క్వాలిటీ బియ్యం డోర్ డెలివరీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. బియ్యం కార్డు ఉన్న పేదవారికి నాణ్యమైన స్టోర్టెక్స్ బియ్యాన్ని డోర్ డెలివరీ (AP YSR Rice Doorstep Delivery Scheme 2020) చేయాలని నిర్ణయించింది. ఈ డోర్ డెలివరీల విషయంలో (Rice Doorstep Delivery Scheme 2020) 9,260 వాహనాలను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసింది. కొత్త సంవత్సరం నుంచి సరికొత్తగా ప్రభుత్వం రేషన్ సరకులను (AP Doorstep Delivery Of Quality Rice) మినీ వ్యాన్ ద్వారా లబ్ధిదారు ఇంటి ముంగిటకే సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది.
స్వయం ఉపాధి పధకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగ యువతకు.. ఈ బియ్యం ఇంటింటికీ డోర్ డెలివరీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. కాగా, ఈ వాహనాలకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ గా సర్కార్ అందించనుంది. ఇక మిగిలిన పది శాతం డబ్బును చెల్లించి యువత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. కాగా, డిసెంబర్ 1 నుంచి ఈ పధకం అమలులోకి రానుండగా.. ఏడాదికి రూ. 776.45 కోట్లు మంజూరు చేసింది.
ఈ వ్యాన్లు తోలేందుకు డ్రైవర్లను కూడా త్వరలో నియామకం చేయనుంది. జిల్లాకు తొలి విడతగా 120 మినీ వ్యాన్లు జైపూర్ నుంచి గూడ్స్ రైలు ద్వారా మంగళవారం న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాయి. గుంటూరు జిల్లాలో 817 మినీ ట్రక్కులు (వ్యాన్లు) అవసరమని జిల్లా అధికారులు గుర్తించారు. ఇందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మినీ ట్రక్కుల కోసం అనూహ్య స్పందన లభించింది. ఈ 817 మినీ ట్రక్కులకు 8,179 మంది దరఖాస్తు చేశారు.