LPG-cylinders (Photo-Twitter)

Newdelhi, Nov 1: దీపావళి పండుగ (Diwali Festival) సంబురాన దేశ ప్రజలకు పెద్ద షాక్. గ్యాస్‌ సిలిండర్‌ (LPG cylinder) ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ పై రూ.62 ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.  తాజా పెంపుతో హైదరాబాద్‌ లో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2028కి పెరిగింది. కోల్‌ కతాలో రూ.1911.50, ముంబైలో రూ.1754.50, చెన్నైలో రూ.1964.50గా ఉన్నది. కాగా, వాణిజ్య అవవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.

బ్లేడ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి.. మహిళలకూ గాయాలు.. ఏపీ తాడేపల్లిలో ఘటన (వీడియో)

డొమెస్టిక్‌ గ్యాస్ సిలిండర్ల

ఇక డొమెస్టిక్‌ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు ప్రకటించడం ఊరటనిచ్చే అంశం. ఢిల్లీలో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.803గా ఉండగా కోల్‌ కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, విజయవాడలో రూ.827.50గా ఉన్నది. హైదరాబాద్‌ లో మాత్రం పై అన్ని నగరాల్లో కంటే అత్యధికంగా రూ.855గా ఉన్నది.

గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. ఏఆర్ కానిస్టేబుల్ కు గాయాలు.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ లో ఘటన (వీడియో)