Lt General Manoj Pande: భారత ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, ఎంఎం నవరణె స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న పాండే, తొలిసారిగా ఇంజినీర్‌కు సైన్యం బాధ్యతలు
Lt Gen Manoj Pande (Credits: ANI)

New Delhi, April 17: భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే (Lt General Manoj Pande) నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ఎంఎం నరవణె స్థానంలో పాండే బాధ్యతలు (New Indian Army Chief) చేపట్టనున్నారు. ఒక ఇంజినీర్‌కు (First Engineer to Hold the Top Post) సైన్యం బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ముకుంద్‌ నరవణే పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో తాజా నియామకం జరిగింది.

మనోజ్‌ పాండే కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ విభాగంలో 1982లో చేరారు.ప్రస్తుతం ఆయన ఆర్మీ వైస్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహించారు. 2001 డిసెంబర్‌లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి అనంతరం చేపట్టిన ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’లో భాగంగా పల్లన్‌వాలా సెక్టార్‌ పరిధిలోని ఎల్‌వోసీ వెంబడి ఇంజినీర్స్‌ బృందానికి హెడ్‌గా పనిచేశారు. ఇథియోపియా, ఎరిత్రియా దేశాల్లో యూఎన్‌ మిషన్‌కు చీఫ్‌ ఇంజినీర్‌గా వ్యవహరించారు. జనరల్ పాండే పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం అందుకున్నారు.

ఢిల్లీ జహంగీర్‌పురిలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తం, పోలీసులపై రాళ్ల దాడి, 23 మందిని అరెస్ట్, పరిస్థితి అదుపులో ఉందని తెలిపిన ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌ రాకేశ్‌ ఆస్థానా

బిపిన్‌ రావత్‌ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్‌ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ నరవణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నరవణె ఏప్రిల్‌ చివరినాటికి రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్‌ పాండే నియామకం ఖరారు అయ్యింది. అంతకు ముందు మనోజ్‌ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్‌ సెక్షన్‌లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్‌ పాండే.. ఏప్రిల్‌ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటీ చైర్మెన్‌గా ఎంఎం న‌ర‌వణె, త్రివిధ దళాధిపతులలో అత్యంత సీనియర్‌ మనోజ్ ముకుంద్ నరవణే కావడంతో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగింత

లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఆల్ ఇండియా రేడియోకు అనౌన్సర్, హోస్ట్ గా పనిచేసిన డాక్టర్ సీజే పాండే, ప్రేమ దంపతులకు జన్మించారు. వీరి కుటుంబం నాగపూర్ కు చెందినది. స్కూలు విద్య తరువాత మనోజ్ పాండ్ నేషనల్ ఢిఫెన్స్ అకాడమిలో చేరాడు. NDA తర్వాత అతను ఇండియన్ మిలిటరీ అకాడమిలో చేరి చీఫ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. పాండే 1987 మే 3న వైద్యురాలు అర్చన సల్ఫేకర్ ని వివాహమాడారు.

సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతి, ప్రజ‌ల మ‌న‌సుల్లో అనేక ప్ర‌శ్న‌లు, సుర‌క్షిత‌మైన ఆధునిక హెలికాఫ్ట‌ర్‌లో ప్రయాణిస్తుంటే ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్న లేవనెత్తిన శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్

కాగా గత ఏడాది డిసెంబర్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించారు. జనరల్ రావత్, అతని భార్య మధులిక, 12 మంది సాయుధ సిబ్బంది 2021 డిసెంబర్ 8వ తేదీన ఒక ఛాపర్ ప్రమాదంలో మరణించారు. బిపిన్ రావత్ నీలగిరి హిల్స్‌లోని వెల్లింగ్టన్‌‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ సందర్శనకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ క్రాష్ అయింది. అయితే ప్రతికూల వాతావరణం వల్లే ఈ యాక్సిడెంట్‌ జరిగిందని విచారణలో తేలింది.