Additional Director General Purushottam Sharma (Photo-ANI/video grab)

Bhopal, Sep 28: ఒక పోలీసు ఉన్నతాధికారి భార్యపై దాడిచేసి దారుణంగా కొట్టిన ఘటన (DG level Officer Beats Wife) మధ్యప్రదేశ్‌లో ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి వివాహేతర సంబంధాన్నిరెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నందుకు భార్యపై ఎదురు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాల్ వైరల్ అయింది. వైరల్ వీడియో వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన అడిషనల్ డైరక్టర్ జనరల్ పురుషోత్తం శర్మ మరో మహిళతో ఇంట్లో అభ్యంతరకరమైన స్థితిలో ఉండగా వారిద్దరిని ఆయన భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దీంతో వీరిద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన డీజీ స్థాయి అధికారి (Additional Director General Purushottam Sharma) భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో పురుషోత్తం కుమారుడు పార్థ్‌ గౌతమ్ (ఐఆర్ఎస్) కుమారుడు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై హోంమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పురుషోత్తంను తక్షణమే విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Here's Video and Update

ఈ వీడియో తాను చూశానని పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా హామీ ఇచ్చారు. అటు ఈ సంఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించింది. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని కమిషన్ ప్రతినిధి సంగీత శర్మతెలిపారు.

ఈ వార్త అంతా అబద్దం, 2016లో విశాఖ మన్యంలో వైరల్ అయిన ఫోటో అది, ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన కాదని గ్రామస్థులు వెల్లడి, ఈ వార్తపై సమాచారం లేదని తెలిపిన చింతకర్ర ఎస్సై

అయితే ఈ వైరల్ వీడియోపై పోలీస్ అధికారి పురుషోత్తం శర్మ స్పందించారు. 32 ఏళ్ల క్రితం తమ వివాహం అయిందనీ, అయితే 2008 లో తనపై భార్య ఫిర్యాదు చేసిందంటూ పురుషోత్తం చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి తన ఇంట్లోనే ఉంటూ అన్ని సౌకర్యాలను అనుభవిస్తోందనీ అయినా నేను ఏమి అడ్డు చెప్పలేదని తెలిపారు. అదనపు డీజీ అయిన నేను దుర్మార్గుడినే అయితే ఇప్పటివరకు ఆమె పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించాడు. తాను నేరస్తుడి కాదని ఇది కుటుంబ వ్యవహారమనీ పేర్కొన్నాడు. అంతేకాదు ఇంట్లో సీసీటీవీలతో భార్య తనపై నిఘా పెట్టిందనీ, తాను రక్షించుకునే క్రమంలో దురదృష్టవశాత్తూ ఈ సంఘటన చోటు చేసుకుందని వాపోయాడు.