Amit Shah takes a holy dip at Triveni Sangam (Photo-ANI)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో 143 ఏళ్లకు ఓ సారి జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh 2025)లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah) పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు (Amit Shah Takes Holy Dip at Triveni Sangam) ఆచరించారు. అనంతరం ఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి అధికారులతో మహాకుంభ్ మీద సమావేశాలు నిర్వహించి కుంభమేళా ఏర్పాట్లపై సమీక్షించారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.

వీడియో ఇదిగో, నదిలోనే బాక్స్ంగ్ పంచ్‌లను ప్రదర్శించిన మేరి కోమ్, త్రివేణి సంగమం వద్ద పవిత్రస్నానం ఆచరించిన ఒలింపిక్ పతక విజేత

ఇక ఈ మహాకుంభమేళాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 5వ తేదీన పాల్గొననున్నారు. ప్రధాని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభమేళాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ సైతం ప్రయాగ్‌రాజ్‌ వెళ్లనున్నారు.సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా 45 రోజులపాటు సాగి ఫిబ్రవ‌రి 26వ తేదీన మ‌హాశివ‌రాత్రితో ముగుస్తుంది.

Amit Shah takes a holy dip at Triveni Sangam

ఇప్పటికే 14 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది.