Mumbai, April 10: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, లాక్‌డౌన్ (Lockdown) నేపథ్యంలో ప్రజలందరూ భౌతికదూరాన్నిపాటిస్తోంటే ఈ బిలియనీర్లు మాత్రం భారీ విందు (Mumbai billionaires violate lockdown) చేసుకున్నారు. దీనికోసం ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra government) నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో పోలీసులు ఈ బిలియనీర్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ బిలియనీర్లు పీఎంసీ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లు తమ కుటుంబ సభ్యులతో మహాబలేశ్వర్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఆరు హై-ఎండ్ వాహనాలను గుర్తించిన స్థానికులు వెంటనే మునిసిపల్ అధికారులకు తహశీల్దార్ కు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లతో సహా మొత్తం 23 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
Here's MAHA Home minister Tweet
As per discussion with Hon. CM, Mr Amitabh Gupta, Principal Secretary (special), has been sent on compulsory leave with immediate effect, till the pending of enquiry, which will be initiated against him.#LawSameForEveryone
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) April 9, 2020
కరోనా -19 లాక్‌డౌన్ (Coronavirus lockdown) నిబంధలను ఉల్లంఘించి, మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్ లో విందు చేసుకుంటున్న వీరిని అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు. అత్యవసరం పరిస్థితి పేరుతో పాస్లు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్ గుప్తాను బలవంతపు సెలవుపై పంపారు.కాగా వీరిద్దరూ తన కుటుంబ స్నేహితులనీ, కుటుంబ అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఖండాలా నుండి మహాబలేశ్వర్ వరకు వెళ్లేందుకు అనుమతించాలంటూ అర్జీ పెట్టుకోగా అమితాబ్ గుప్తా పాసులు జారీ చేశారు.
దేశంలో కరోనా కలవరం, 12 గంటల్లో 547 కరోనా పాజిటివ్ కేసులు
పాసులు జారీ అయిన వెంటనే బుధవారం రాత్రి ఐదు కార్లలో ముంబైకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నఫామ్‌హౌస్ తరలివెళ్లారు. వాధ్వాన్ల వంటవారు, సేవకులు ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభంలో అత్యంత ప్రభావితమైన దేశం ఇటలీకి చెందిన వాధ్వాన్ బాడీగార్డ్ ఇందులో ఉన్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు వీరందరిపైనా కేసు నమోదు చేశారు. వీరిని క్వారంటైన్కు తరలించామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
మరోవైపు పీఎంసీ బ్యాంకు కుంభకోణం సహా, పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, కపిల్, ధీరజ్ వాధ్వాన్ మీద సీబీఐ (CBI) లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. గత నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, మూడుస్లారు నిందితులు తప్పించుకున్నారు. అయితే క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.