Exams Results

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) విడుదల చేశారు. అక్టోబర్‌ 3 నుంచి 21వ వరకు టెట్‌ పరీక్షలు (AP TET Exam) జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్‌ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఫలితాలను(AP TET Results) విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు. పరీక్షల్లో 1,87,256 (50.79 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.

వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు, తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించినట్టు తెలిపారు. ఫలితాలను (https://cse.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చన్నారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. టెట్ లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు

9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554