Mumbai, April 21: మహరాష్ట్రలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. డాక్టర్, సామాన్యులు, చిన్నా పెద్దా తేడా లేకుండా అందర్నీ వణికిస్తోంది. రోగులకు వైద్యం అందించే డాక్టర్లను సైతం ఈ వైరస్ చంపేస్తోంది. తాజాగా ముంబైలో ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన మరుసటి రోజే ఈ మహమ్మారికి ఓ డాక్టర్ చనిపోయారు.ముంబైలో మనీషా జాదవ్ (Corona positive doctor Manisha Jadhav) అనే 51ఏళ్ల డాక్టర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో రోజురోజుకీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించసాగింది. అది గ్రహించిన ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.
‘ఇదే నా చివరి ఉదయం కావచ్చు ('May be last good morning'). నేను రేపు మళ్లీ మిమ్మల్ని కలవకపోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండండి. శరీరం సహకరించడంలేదు. ఆత్మ లేదు. కానీ అది అమరత్వం’ అని మనీషా పోస్టు చేసిన మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తనువు చాలించేందుకు 36 గంటల ముందు (36 hours before death) ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
51 ఏండ్ల డాక్టర్ మనీషా జాదవ్ (Manisha Jadhav) చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరారు. సెవ్రీ టీబీ ఆస్పత్రిలో (Sewri TB Hospital) సీనియర్ మెడికల్ అధికారిగా ఆమె పనిచేస్తున్నారు. ఐసీయూ బెడ్ నుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలో..ఇక ఈ వేదికపై నేను మిమ్మల్ని కలవలేకపోవచ్చు..ఇదే చివరి గుడ్ మార్నింగ్..అందరూ జాగ్రత్తలు పాటించండి..శరీరం మరణించినా ఆత్మ నశించదని రాసుకొచ్చారు.
మరోవైపు కొవిడ్-19తో గత ఏడాది మార్చి నుంచి ముంబైలో ఇప్పటివరకూ 18,000 మంది వైద్యులకు కొవిడ్ సోకగా 168 మంది మరణించారు.