Lucknow, July 6: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. లగ్జరీ బస్సులో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం (Minor Girl Gang-Raped In Uttar Pradesh) జరిపారు. ఈ దారుణ ఘటన సుల్తాన్ పూర్ జిల్లాలో జరిగింది. వాహనాల తనిఖీల్లో భాగంగా సుల్తాన్ పూర్ లో ఓ లగ్జరీ బస్సు ఆపి పోలీసులు తనిఖీ చేయగా అందులో ఇద్దరు బాలికలున్నారు.
తాము ఇంటరాగేట్ చేయగా బస్సులో ఉన్న డ్రైవరుతోపాటు మరో ఇద్దరు 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేశారని తేలిందని సర్కిల్ పోలీసు అధికారి బాల్ దిరాయ్ రాజారాం చౌదరి చెప్పారు. బాలికకు వైద్యపరీక్షలు జరిపి, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. బస్సును సీజ్ చేసి అత్యాచారం కేసులో (Minor Girl Gang-Raped) నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక మరో రాష్ట్రం బీహార్‌లో రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీకి వచ్చి ఒంటరిగా ఉన్న ఓ మహిళా డాక్టరుపై అత్యాచారం చేసిన దాబా యజమాని కుమారుడి బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. చెండిపద ఏరియాలోని దాబా యజమాని కుమారుడు సుకుంత బెహ్రా(35) రాత్రి 11 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు ఓ మహిళా డాక్టరు ఇంటికి వచ్చాడు.
మహిళా వైద్యురాలు ఒంటరిగా ఉండటం చూసిన సుకుంత బెహ్రా ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. మహిళా వైద్యురాలు తన క్వార్టరులో నివాసముండగా ఆమెపై సుకుంత అఘాయిత్యం చేశాడు. మహిళా డాక్టరు సోదరుడి ఫిర్యాదు మేర పోలీసులు సుకుంత బెహ్రాపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. వైద్యురాలిని పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.