stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

New Delhi, September 22: దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు, ఏకంగా కదులుతున్న బస్సులోనే కామాంధులు రేప్ లకు (Rape) పాల్పడుతున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి ఔరియాకు స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ బాలికపై బస్సు సిబ్బందే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షికోహాబాద్ కొత్వాలీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (15), మేనకోడలుతో కలిసి ఢిల్లీ, బదర్‌పూర్ సరిహద్దు నుంచి స్లీపర్‌ బస్సులో షికోహాబాద్‌కు వెళ్తోంది. బస్సు నోయిడా, ఆగ్రా మధ్యమార్గంలో భోజనం కోసం కొద్దిసేపు ఆపారు. ఆ సమయంలో అందరూ బస్సు దిగగా బాలిక సీటులోనే ఉండిపోయింది. బస్సులో ఒంటరిగా ఉన్న బాలికను చూసిన బస్సు సిబ్బంది బబ్లూ, ఆషు అత్యాచారానికి ( Raped in Bus) పాల్పడ్డారు.

ప్రేమికులను దారుణంగా హింసించిన గ్రామస్థులు, మెడలో స్కూటర్‌ టైర్‌ వేసి డ్యాన్స్‌ చేయాలని ఒత్తిడి, ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

కాసేపటి తర్వాత బాధితురాలి తల్లి బస్సులోకి వచ్చి కుమార్తె కోసం చూడగా సీటులో కనిపించలేదు.దీంతో కంగారుతో ఆమె వెతుకుతుండగా మరో క్యాబిన్‌లో కుమార్తె ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని రోదిస్తూ చెప్పింది. వెంటనే ఆ మహిళ బస్సును ఆపాలని.. వాళ్లిద్దరినీ పోలీసులకు అప్పగించాలని ఎంత చెప్పినా డ్రైవర్ బస్సు ఆపలేదు.

రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్త, తట్టుకోలేక మర్మాంగాలు కోసి హత్య చేసిన భార్య, వరంగల్ జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

ఆమెతో పాటు తోటి ప్రయాణికులు కూడా బస్సు ఆపాలని కేకలేయడంతో చివరకు ఆపాడు. అయితే ఈలోపే నిందితులలో ఒకడైన అషు అలీగఢ్‌లోని టప్పల్ దగ్గర దిగిపోగా, కొంతదూరం వెళ్లాక మరో నిందితుడు బబ్లూ కూడా మధురలోని నౌజీల్ వద్ద బస్సు దిగాడు.

నెల్లూరు జిల్లాలో దారుణం, భార్య ఉరేసుకుంటుంటే భర్త ఆపకుండా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు, ఆ వీడియోని బంధువులకు పంపించి పైశాచికానందం పొందాడు

మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షికోహాబాద్ చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని పోలీసులకు బాధితురాలి తల్లి తెలిపింది. బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో బస్సును తనిఖీ చేశారు. ఈ మేరకు అషును పోలీసులు అరెస్ట్ (Conductor Arrested) చేయగా, మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.