Chennai, Oct 2: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్టాలిన్ దూసుకుపోతున్నారు. నేరుగా ప్రజల మధ్యకే వెళుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నేరుగా పొలాల్లోకి వెళ్లి మరీ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా సీఎం స్టాలిన్ పొలంలో పనిచేస్తున్న మహిళల దగ్గరకే (MK Stalin Talking With Women Lobour) వెళ్లాడు. తన ప్రొటోకాల్ పక్కనబెట్టి మరీ వారితో సంభాషించాడు. సీఎంను చూసిన మహిళలు ( MK Stalin interacts with people of Nattapatti village) ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మధురై జిల్లా, నట్టపటి గ్రామంలో మహిళలంతా పొలంలో పని చేసుకుంటూ బిజీగా ఉన్నారు. వారంతా పొలంలో నాట్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న స్టాలిన్... తన వాహానం ఆపి.. పొలంలోకి వెళ్లి మహిళా రైతులతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రే తమ వద్దకు రావడంతో సదరు మహిళా రైతుల ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారి సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపారు.
Here's Viral Video
வயலில் இறங்கி விவசாயிகளுடன் பேசிய ஸ்டாலின்!!!#NewsGLitz || #Tnfarmers || #Shorts || @CMOTamilnadu || @mkstalin || @DMKITwing pic.twitter.com/Sm4svpl4UI
— newsglitz (@newsglitzcom) October 2, 2021
ఏకంగా ముఖ్యమంత్రే తమ వద్దకు రావడంతో సదరు మహిళా రైతుల ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారి సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపారు.2/2
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 2, 2021
నేరుగా సీఎం తమ వద్దకు రావడంతో వారు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని పొందారు. దటీజ్ స్టాలిన్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.