ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఉద్యోగుల తీసివేతకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం లేదా దాదాపు 1,600 మంది ఉద్యోగుల తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా కొంతమందిని తొలగించబోతున్నామన్న మోర్గాన్ స్టాన్లీ సీఈవో జేమ్స్ గోర్డాన్ ఇటీవల వ్యాఖ్యలను ఉటింకిస్తూ సీఎన్‌బీసీ మీడియా నివేదించింది.
కంపెనీలో దాదాపు 81,567 మంది ఉద్యోగులున్నారు. అయితే ఈ నివేదికపై గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఇంకా వ్యాఖ్యానించలేదు.మోర్గాన్ స్టాన్లీ ప్రత్యర్థి గోల్డ్‌మన్ సాచ్స్ ,సిటీ గ్రూప్, బార్క్లేస్ సహా ఇతర పెట్టుబడి సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మోర్గాన్ స్టాన్లీ చేరింది.
కాగా ఆర్థిక మాంద్యం, ఆదాయా కక్షీణత నేపథ్యంలో ట్విటర్, అమెజాన్, మెటా, పెప్సీకో లాంటి అనేక ఇతర కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.