MP Shocker: పట్టపగలే నడిరోడ్డు మీద ఇద్దరు మహిళలపై విరుచుకుపడిన కామాంధులు, ముద్దులు పెడుతూ తాకరాని చోట తాకుతూ లైంగిక వేధింపులు, 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Rape | Representational Image (Photo Credits: Pixabay)

Bhopal, Mar 14: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అలిరాజ్‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సభ్య సమాజం సిగ్గుపడేటా దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. భ‌గోరియా వేడుక‌ల్లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను బ‌హిరంగంగా లైంగిక వేధింపుల‌కు (Group of Men Sexually Harass Women) గురిచేసిన దుండ‌గుల‌పై పోలీసులు కేసు న‌మోదుచేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు సుమోటోగా కేసు న‌మోదు చేసి ముగ్గురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

పోలీసులు పదిహేను మంది నిందితులను గుర్తించి అరెస్టు చేసినప్పటికీ బాధితుల జాడ తెలియలేదు. తాజాగా ఈరోజు15 మందిని (15 arrested after video of mob sexually molesting women) అరెస్ట్ చేశారు. సోమవారం నాడు 19 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 15 మంది బాలురుతో సహా నిందితులందరినీ గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

మరిదిపై మనసుపడిన వదిన, పెళ్లైన నెలకే భర్త లేని సమయంలో మరిదితో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయింది..

కాగా సొన్వా ప్రాంతంలోని వ‌ల్పూర్ గ్రామ శివార్ల‌లో శుక్ర‌వారం ఈ దారుణం జరిగింది. వైర‌ల్ వీడియోలో మ‌హిళ‌లు ఓ వాహ‌నం ప‌క్క‌న నిలుచునిఉండ‌గా ప‌లువురు వ్య‌క్తులు వారి చుట్టూ మూగి ప‌ట్ట‌ప‌గ‌లే లైంగిక వేధింపుల‌కు (sexually molesting women in public) పాల్ప‌డుతున్న దృశ్యాలు క‌నిపించాయి. ఈ దృశ్యాల‌ను అక్క‌డున్న వారు త‌మ ఫోన్ల‌లో రికార్డు చేసినా వారిని కాపాడేందుకు మాత్రం ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు. ఈ వీడియోలో స‌రుకు ర‌వాణా వాహ‌నం వెనుక నిలుచున్న మ‌హిళ‌ల‌ను ముద్దుపెట్టుకునేందుకు దుండ‌గులు ప్ర‌య‌త్నిస్తున్న దృశ్యాలు క‌నిపించాయి.

మ‌హిళ‌లు త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించినా వారిని వెంటాడిన దుండ‌గులు అందరిముందే లైంగికంగా వేధించారు. బాధిత మ‌హిళ‌లు ఫిర్యాదు చేయ‌క‌పోయినా వీడియో వైర‌ల్ కావ‌డంతో స్పందించిన పోలీసులు నిందితుల‌పై కేసు న‌మోదు చేసి గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. ప‌రారీలో ఉన్న మ‌రికొంద‌రు నిందితుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని త్వ‌ర‌లోనే వారిని ప‌ట్టుకుంటామ‌ని అలిరాజ్‌పూర్ ఎస్పీ మ‌నోజ్ కుమార్ తెలిపారు.

మనది మగాళ్ల రాష్ట్రం, అందుకే అత్యాచారాల్లో అగ్రస్థానంలో ఉన్నాం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ మంత్రి శాంతి ధరివాల్‌

భగోరియా పండుగ ఆచారాలను ప్రస్తావిస్తూ సమస్య నుంచి తప్పుకోడానికి ప్రయత్నించినప్పటికీ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ఈ సంఘటన ప్రతిబింబిస్తోందని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా మాట్లాడుతూ, “భగోరియా పండుగ చాలా పవిత్రమైన, స్వచ్ఛమైన పండుగ. ఇద్దరు మహిళలపై జరిగిన వేధింపుల సంఘటన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో బాలికలు, మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారని తెలియజేస్తుంది. నిందితులను అరెస్టు చేశారు కానీ ఇది శోచనీయమైన చర్య అని తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ సంఘటనను నేరంగా పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.